విజయనగరం కలెక్టర్ ఛాంబర్ లో జరిగిన క్రిస్మస్ వేడుకలు హాట్ టాపిక్ అయ్యాయి. మిగిలిన వేడుకలు, కార్యక్రమాలు ఎన్నడూ జరగని కలెక్టర్ ఛాంబర్ లో కేవలం క్రిస్మస్ వేడకులు మాత్రమే ఎందుకు రెవిన్యూ అసోసియేషన్ నిర్వహించిందని హిందూ ధర్మ రక్షా సమితి ఆరోపిస్తోంది. కాగా జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఈ సాయంత్రం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేక్ కట్‌చేసి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, డిఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఎస్‌డిసిలు మురళీకృష్ణ, నూకరాజు, సుధారాణి, ప్రమీలాగాంధీ, ఆర్‌డిఓ రామ్మోహన్, కలెక్టరేట్ ఏఓ దేవ్ ప్రసాద్, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తాడ్డి గోవింద, వివిధ మండలాల తాసిల్దార్లు, డిటిలు, రెవెన్యూ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, పాస్టర్లు పాల్గొన్నారు.
previous post
next post