37.2 C
Hyderabad
March 29, 2024 21: 07 PM
Slider కడప

కడప లో రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కు చుక్కెదురు

#FisheriesCommissioner

మత్స్యకారులకు ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ కన్నబాబు అన్యాయం చేయడంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు సీఎం సొంత జిల్లాలో మత్స్యకార సహకార సంఘాల సభ్యులు మత్స్యశాఖ కమిషనర్ ను నిలదీసిన సంఘటన నేడు జరిగింది. మత్స్యకారులపై కమిషనర్ కన్నబాబు చికాకు పడటంతో దానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మత్స్యకారులు నిర్ణయించారు. ఈ కమిషనర్ మాకొద్దు.. మత్స్య శాఖపై అవగాహన లేని ఈ కమిషనర్ ను బదిలీ చేయాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. కడప నగరంలో జరిగిన మత్స్య సహకార సంఘాల సమావేశంలో మత్స్యకారులను కమిషనర్ బెదిరించారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన హబ్ కు ప్రతి సొసైటీ నుంచి పట్టే చేపలలో 30శాతం ఇవ్వాలని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫిష్ ఆంధ్రాను అమలు చేయాలని.. ప్రభుత్వ నిర్ణయాలను మీరు పాటించకుంటే… 217 జీవోను నెల్లూరుతో పాటు కడప జిల్లాలో కూడా అమలు చేస్తామని.. సమావేశంలో మత్స్యకారులను కమిషనర్ బెదిరించడంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత్స్య శాఖ కమిషనర్ కన్నబాబు తీరు పట్ల.. ఏపీ వ్యాప్తంగా వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మత్స్యకారుల నిర్ణయం తీసుకున్నారు.

Related posts

జగనన్న కాలనీల్లో పేదలకు అన్యాయం చేస్తున్న అవినీతిపరులు

Satyam NEWS

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయిన మత మార్పిడులు

Satyam NEWS

చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన కదిరి నియోజకవర్గం నేతలు

Satyam NEWS

Leave a Comment