29.2 C
Hyderabad
October 13, 2024 16: 11 PM
Slider సినిమా

సినీ నటుడు వినాయకన్ అరెస్టు

#actorvinayakan

జైలర్ ఫేమ్ , నటుడు వినాయ‌క‌న్‌ను సీఐఎస్ఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. గ‌తేడాది మద్యం మత్తులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై వినాయ‌క‌న్ దాడికి పాల్ప‌డ్డాడు. బాధిత కానిస్టేబుల్ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు శ‌నివారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. వినాయ‌క‌న్‌ను ఆర్జీఐ ఎయిర్‌పోర్టు పోలీసులు విచారిస్తున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని వినాయకన్ ఇప్ప‌టికే ప‌లుమార్లు చెప్పాడు.

సీఐఎస్ఎఫ్ అధికారులు తనను విమానాశ్రయంలోని ఓ గదిలోకి తీసుకెళ్లి దాడి చేశారని వినాయకన్ ఆరోపించారు. కావాలంటే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని కోరాడు. వినాయకన్‌కు వివాదాలేమీ కొత్తేం కాదు. గ‌తేడాది అక్టోబర్ నెలలో కేరళ పోలీసులు వినాయకన్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీస్టే స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో పలువురితో గొడవకు దిగారు. మద్యం మత్తులో తమ అపార్ట్‌మెంట్‌లో న్యూసెన్స్ చేస్తున్నారని, తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పొరుగువారు ఫిర్యాదు చేయడంతో వినాయకన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Related posts

సీఎఫ్ఐ ఏపీ ప్రధాన కార్యదర్శి గా లలిత్ కుమార్

Satyam NEWS

వందేళ్ల చరిత్ర కలిగిన డీసీసీబీ ఈ స్థాయి కి చేరింది

Satyam NEWS

టీటీడీ నేతృత్వంలో కార్తీక మాస మహావ్రత దీక్ష

Satyam NEWS

Leave a Comment