34.2 C
Hyderabad
April 23, 2024 13: 46 PM
Slider సంపాదకీయం

కాంట్రవర్సీ: బాజిరెడ్డీ ఇంత సైలెంటుగా ఎలా ఉంటున్నావు?

movie cam

‘సైలెంటుగా ఉండటానికి ఇదేం లైబ్రరీ కాదు బాజిరెడ్డీ’ అతడు సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఇది. కానీ అమరావతి నుంచి రాజధానిని తరలిస్తుంటే మాత్రం మహేష్ బాబు సైలెంటుగానే ఉన్నాడు. మహేష్ బాబు ఒక్కడే కాదు. తెలుగు సినిమా హీరోలందరూ సైలెంటుగానే ఉండిపోయారు.

అమరావతినే రాజధానిగా ఉంచాలి అని చెప్పడమో లేక మూడు రాజధానులు అవసరం అని చెప్పడమో చేయడం లేదు. ఇదే ప్రశ్న వేస్తే రాజకీయాలకు మాకు సంబంధం లేదండీ అంటారు. రాజధాని మార్పు అనేది రాజకీయ అంశం కాదు. పరిపాలనాసౌలభ్యానికి సంబంధించిన అంశం. రాజకీయ అంశం కానప్పుడు మాట్లాడాలి కదా? మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తెనాలి సమీపంలోని బుర్రిపాలెం గ్రామంలో పుట్టి పెరిగారు.

ఆ తర్వాత ఆయన పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యారు. మహేష్ బాబు బావ ఇప్పుడు గుంటూరు ఎంపి. ఆయన బాబాయి వైసిపిలో ఉండేవారు. మరి ఇదంతా రాజకీయపరంగా జరుగుతున్నప్పుడు నాకు రాజకీయాలతో సంబంధం లేదు అని చెపడం కరెక్టా? ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే ఆయన సాక్ష్యాత్తూ కేంద్ర మంత్రిగా పని చేశారు. రాజకీయ పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు.

అమరావతి రైతులు ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తారని సోషల్ మీడియాలో ఎవరో ప్రచారం చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలలోని తన అభిమాన సంఘాలకు కబురు పెట్టి వారందరిని హైదరాబాద్ లో తన ఇంటి వద్ద ప్రతిధర్నా చేసేందుకు పిలిపించారు తప్ప అమరావతి రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదు. మూడు రాజధానులు అవసరం అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగానే స్వాగతించిన చిరంజీవి ఆ తర్వాత సైలెంటు అయ్యారు.

ఇక నాగార్జున, వెంకటేష్ లాంటి నటుల మూలాలు ఆంధ్రా లోనే ఉన్నాయి. అయినా వారు రాజధాని అంశంలో మాట్లాడరు. ఇలా ఒక్కళ్లో ఇద్దరో కాదు. తెలుగు సినిమా హీరోలు అందరూ సైలెంటుగానే ఉన్నారు. బాజిరెడ్డి లైసెన్సు లాగా వీరి సైలెన్సు కు కూడా ఒక అర్ధం ఉంది. కొందరికి వైజాగ్ లో స్టూడియో నిర్మించేందుకు స్థలాలు కావాలి. మరి కొందరికి నామినేటెడ్ పోస్టులు కావాలి.

స్టూడియోలకు స్థలాలు, నామినేటెడ్ పదవులు అవసరం లేకుండా కూడా చాలా మంది ఉన్నారు. వారి నిశ్శబ్దం వెనుక ఒక భయం దాగి ఉంది. అమరావతికి జై అంటే ‘ చూశారా కమ్మోడు కాబట్టి అమరావతికి జై అంటున్నాడు’ అని వ్యాఖ్యానిస్తారేమోనని భయపడుతున్నారు.

మూడు రాజధానులు ముద్దు అంటే ‘ కమ్మోడు అయి ఉండి కూడా జగన్ కు భయపడుతున్నాడు’ అంటారని భయం. ఈ సమస్య దాటే వరకూ వీరికి టెన్షనే. ఆంధ్రా, సీడెడ్ లో సినిమాల కలెక్షన్ల పైనే తెలుగు సినిమాల జీవితం ఆధారపడి ఉంటుంది. అక్కడ సినిమాలు ఆడకపోతే జీవితమే లేదు. అందుకే అందరు హీరోలూ అతడు సినిమాలో లాస్ సీన్ లో బాజిరెడ్డి లాగా అయిపోయారు.  

Related posts

ముంపు మండలాల ప్రజల వినూత్న నిరసన

Satyam NEWS

మత విభజనతోనే గుజరాత్‌లో బీజేపీ గెలుపు

Murali Krishna

శివోహం: మహా శివరాత్రి వ్రతం ఎలా ఆచరించాలి?

Satyam NEWS

Leave a Comment