రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని GHMC పార్క్ లో పరుచూరి వెంకటేశ్వరరావు, తూర్పు జయప్రకాష్ రెడ్డి, జయలలిత, వినోద్ బాల, రామ్ జగన్, కాదంబరి కిరణ్, టిఆర్ఎస్ నాయకుడు కర్నాటి విద్యాసాగర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఒక గొప్ప కార్యక్రమం చేపట్టారని ఆయన చేపట్టిన కార్యక్రమంలో మూడు కోట్ల మొక్కలు నాటడం సంతోషకరమని ఇంత మంచి కార్యక్రమం లో తమను కూడా భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
previous post
next post