ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ అనారోగ్యంతో మరణించారు. గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఆయన చివరకు అర్ధరాత్రి 12 గంటల 21 నిముషాలకు ఆఖరి శ్వాస తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించిన వేణు మాధవ్ వేల చిత్రాల్లో నటించారు. కొన్ని చిత్రాలలో ఆయన హీరోగా కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. హాస్యానికి కొత్త బాటలు వేసిన వేణు మాధవ్ మృతి తెలుగు చలన చిత్ర సీమకు తీరని లోటని పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
previous post
next post