33.2 C
Hyderabad
April 25, 2024 23: 40 PM
Slider సినిమా

ఇంటర్వెల్: కరోనా భయంతో బయటకు రాని బడా హీరోలు

#Telugu Film Industry

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉంది టాలీవుడ్ బడా హీరోల పరిస్థితి. కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ లు అన్నీ ఆగి పోయాయి. లాక్ డౌన్ సడలింపు ల నేపథ్యంలో సినిమా షూటింగులు కూడా అనుమతి ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నిర్మాత సురేష్ బాబు, బాహుబలి డైరెక్టర్ రాజమౌళి పెద్దరికం తీసుకొని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి సినిమా షూటింగులకు అనుమతి కోరారు.

వారి కోరిక మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినిమా షూటింగులకు అనుమతులు మంజూరు చేశారు. అయితే కొన్ని షరతులు విధించారు. ఆ షరతులకు అనుగుణంగా మాక్ షూటింగ్ కూడా చేసి చూపించారు. ఇంత కథ జరిగిన తర్వాత ఇప్పుడు కథ మళ్లీ మొదటికి వచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది.

దాంతో షూటింగులు మొదలుపెట్టడానికి అగ్ర హీరోలు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్ తీవ్రత తగ్గిన అప్పుడే షూటింగులు మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్ నిర్వహించడం అంత తేలికైన పని కాదని వారికి ఇప్పుడు అర్థమైంది. ఆర్.ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ప్రారంభిద్దాం అనుకున్న రాజమౌళి తన నిర్ణయాన్ని రద్దు చేసుకున్నారు.

అదేవిధంగా వెంకటేష్ తాజాగా తన కొత్త సినిమా నారప్ప షూటింగ్ వద్దని నిర్ణయించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన ఆచార్య సినిమాను ఇప్పటిలో ప్రారంభించే ఆలోచనలో లేరు. ప్రస్తుతానికి కొన్ని సినిమాలు మాత్రమ పూర్తి చేస్తున్నారు. అవి కూడా ప్యాచ్ వర్క్ వరకూ మాత్రమే పరిమితం అయ్యాయి.

కొత్తగా ప్రకటించిన సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా వాయిదా వేయడానికి నిర్ణయించుకున్నారు. ఒక పెద్ద హీరో షూటింగ్ కి రావాలంటే కనీసం పదిమంది వ్యక్తిగత సిబ్బంది ఉండాల్సిందే. దానికి తోడు ఏసీ, కార్వాన్ లేనిదే పని జరగదు. ఏసీలు వాడకూడదు అని ప్రభుత్వం గట్టిగా చెప్పింది. ఇన్ని భయాలు, పరిమితుల మధ్య షూటింగ్ జరపడం అంత సులభమైన పని కాదు. అందుకే ప్రస్తుతానికి ఇంటర్వెల్లే.

Related posts

బంధాలను కొనసాగించలేని వారే అనాథలు

Satyam NEWS

ప్రజల కోసమే చంద్రబాబు పోరాటం: నారా భువనేశ్వరి

Satyam NEWS

తెనాలిలో గంజాయి మొక్కల కలకలం

Bhavani

Leave a Comment