37.2 C
Hyderabad
March 28, 2024 20: 19 PM
Slider ముఖ్యంశాలు

ఏప్రిల్ 5 ఛలో ఢిల్లీ… సీఐటీయూ పిలుపు…!

#citu

కార్మిక,కర్షక హ క్కుల కోసం ఏప్రిల్ 5 న ప్రజా సంఘాలు చేపట్టిన మార్చ్ టు పార్లమెంట్ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్మికులు,రైతులు,వ్యవసాయ కార్మికులు,కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సి ఐ టి యు విజయనగరం జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్, ఎపి మెడికల్  సేల్స్  రిప్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యు ఎస్ రవికుమార్ లు పిలుపునిచ్చారు.ఈ మేరకు  సి ఐ టి యు నాయకులు రెడ్డి శంకరరావు అధ్యక్షతన విజయనగరం లో జరిగిన సదస్సులో వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారం లో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మిక ,ప్రజా,రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులు కాలరాస్తున్నరని ఆరోపించారు.రైతులు ఆత్మ హత్యలు దేశ వ్యాప్తంగా పెరిగాయన్నారు. దేశ సంపదను అధాని,అంబానీలు కట్టబెట్టి దోపిడీ చేస్తున్నారన్నారు. కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని,దేశీయ పరిశ్రమలను పెట్టుబడి దార్లుకు  కట్టబెట్టి లూటీ చేస్తున్నారన్నారు.అందులో బాగంగా రైల్వే,బి ఎస్ ఎన్ ఎల్,ఎల్ ఐ సి, విశాఖ స్టీల్ ప్లాంట్ అదాని,అంబానీలు ఇచేస్తున్నరన్నరు.

కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000/-లు, కనీస పెన్షన్ 10,000/-లు ఇవ్వాలి, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సదస్సు ద్వారా డిమాండ్ చేశారు.కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, టైమ్ స్కేల్, స్కీం వర్కర్లు, డైలీవేజ్, కంటింజెంట్ ఉద్యోగుల, కార్మికుల రెగ్యులరైజేషన్, సిపిఎస్ రద్దు, ఒపిస్ పునరుద్ధరణ చేయాలని, కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం చేయాలి, కేరళ తరహా రైతు రుణమాఫి చేయాలి, విద్యుత్ సవరణ బిల్లు 2022 రద్దు చేయాలని, ఎరువుల సబ్సిడీని పెంచాలని సదస్సు ద్వారా డిమాండ్ చేశారు. ఉపాధిహామీ చట్టానికి బడ్జెట్ లో 2లక్షల కోట్లకు పెంచాలని,పట్టణాలకు విస్తరింప చేయాలని, కుటుంబానికి 200 రోజులు పని,  600/-లు వేతనం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి భరోసా, పరిహారాలు ఇవ్వాలన్నారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, ప్రజాపంపిణీకి 3లక్షల కోట్లు కేటాయించి 14 రకాల సరుకులు సబ్సిడీ ధరలతో అందించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలి. మోనిటైజేషన్ పైపైన్ రద్దు చేయాలని, అటవీ హక్కుల చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక, రైతు, వ్యవసాయ, కౌలు రైతు సంఘాల చేపట్టిన ఏప్రిల్ 5 న చలో ఢిల్లీ కార్యక్రమం లో జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.సదస్సులో సి ఐ టి యు నాయకులు ఏ.జగనోహన్,.బి.రమణ కార్మికులు,రైతులు,కూలీలు పాల్గొన్నారు.

Related posts

అమరావతి ల్యాండ్ స్కాం లో హైకోర్టు తీర్పుపై సుప్రీంకు

Satyam NEWS

టెండర్ హెడేక్: అభ్యర్థులకు తలనొప్పిగా మారిన రీపోలింగ్

Satyam NEWS

4039 కొనుగోలు కేంద్రాల్లో నిరంతరాయంగా ధాన్యం కొనుగోళ్లు

Satyam NEWS

Leave a Comment