27.7 C
Hyderabad
April 25, 2024 09: 57 AM
Slider నల్గొండ

రైతులపై బిజెపి దాడిని అందరూ ఖండించాలి: సిఐటియు

#cituc

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం,రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలపై,కార్మిక కోడులపై ఈనెల 8న, జరిగే రాష్ట్ర వ్యాప్త సమ్మె విజయవంతం చేసి కార్మికుల సత్తా ఏమిటో చాటాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు ఈనెల 8న, జరప తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె పోస్టర్ విడుదల చేసిన అనంతరం రోషపతి మాట్లాడుతూ గడిచిన పది మాసాలకు పైగా భారత రాజధాని ఢిల్లీ మహానగరంలో రైతులు ఆందోళనలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం సబబు కాదని, రైతులను సమావేశపరచి చర్చల ద్వారా పరిష్కరించకపోవడం హేయమైన చర్య అని అన్నారు.

ముగ్గురు రైతులు బలై,15 మంది గాయాలపాలైతే ఇంతటి దుర్మార్గపు చర్యకు పాల్పడిన వారిపై ఏ చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు.భారతదేశ మేధావులు,రాజకీయ వేత్తలు రైతులపై జరుగుతున్న దుశ్చర్యలను తీవ్రంగా ఖండించాలని అన్నారు. ఇప్పటికైనా నా బిజెపి ప్రభుత్వం కార్మిక,రైతుల చట్టాలను సవరణ చేయాలని,భారతదేశ రైతులపై  జులూమ్ మానుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో యలక సోమయ్య గౌడ్, వెంకన్న,రాజు,టి.రాములు,పద్మ, ఉమా,లక్ష్మయ్య,లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సీనియర్ జర్నలిస్టు రాంబాబు కరోనాతో మృతి

Satyam NEWS

పద్మశాలీలు సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించాలి

Satyam NEWS

వైసిపి నేతల భూకబ్జాల నుంచి కడపను కాపాడండి

Satyam NEWS

Leave a Comment