31.7 C
Hyderabad
April 25, 2024 00: 13 AM
Slider నల్గొండ

కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి: సిఐటియు

#cituhujurnagar

పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా సిమెంట్ పరిశ్రమలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి డిమాండ్ చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండల రామాపురం ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో శీతల రోషపతి మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులందరినీ అడ్మిట్ చేయాలని కోరారు. మండలంలోని మేళ్ళచెరువు మండలంలో మై హోం సిమెంట్  ఫ్యాక్టరీలో గత నెల 13వ,తారీకు ప్రమాదవశాత్తు కార్మికునికి దెబ్బలు తగిలి హైదరాబాద్ యశోద హాస్పిటల్ జాయిన్ చేయటం జరిగింది అతనికి 10 లక్షల దాకా హాస్పిటల్ ఖర్చవుతుందని,ఇన్సూరెన్స్ ఆరు లక్షలు మేరకే మేము పెడతామని మిగతాది నాలుగు లక్షలు కుటుంబ సభ్యులు పేట్టుకోవాలని యాజమాన్యం చెప్పడంతో కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తామని కుటుంబసభ్యులు తెలుపగా మరల ట్రీట్మెంట్ చేయించారని,యాజమాన్యం మీద లేబర్ కమిషన్ చర్యలు తీసుకోవాలని,ఇలాంటివి మరొకమారు జరగకుండా చూడాలని కోరారు.

ఈ నెల 29వ,తేదీన కామ్రేడ్ మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద  జరగనుందని,ఈ సమావేశానికి సిపిఎం ఆల్ ఇండియా పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి  ముఖ్యఅతిథిగా రానున్నారని,సంస్కరణ సభను విజయవంతం చేయుటకు అన్ని వర్గాల కార్మికులు హాజరుకావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష్య,కార్యదర్శి తీగల శ్రీను, అజరుద్దీన్,ప్రకాష్,లక్ష్మయ్య,వీరయ్య, చౌదరి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ధాన్యం సేకరణ సజావుగా జరగాలి

Satyam NEWS

ఎక్సోడస్: వైసీపీ లోకి సతీశ్ కుమార్ రెడ్డి

Satyam NEWS

క‌రోనా దృష్ట్యా న్యూ ఇయ‌ర్ వేడుక‌లు ర‌ద్దు

Satyam NEWS

Leave a Comment