40.2 C
Hyderabad
April 24, 2024 18: 39 PM
Slider నల్గొండ

కార్మికులు, ఆశా, అంగన్వాడీ, జూనియర్ డాక్టర్ల ను పర్మినెంట్ చేయాలి

#CITU Hujurnagar

కరోనా లాక్‌డౌన్‌ కాలంలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఉద్యోగాలు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులకు, గ్రామపంచాయతీ కార్మికులకు, ఆశా, అంగన్వాడి, జూనియర్ డాక్టర్ల ని పర్మినెంటు చేయాలని,వారి వేతనం సమస్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి డిమాండ్ చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శృతి రైస్ మిల్ లో దినకూలీగా పనిచేసే అమెరబోయిన రాములమ్మకు కరోనా రావడంతో CITU సంఘం సహకారంతో  6000  రూపాయలు మాదవరాయినగూడెం లోని ఆమె ఇంటి వద్ద అందించిన సందర్భంగా రోషపతి మాట్లాడుతూ అసంఘటిత రంగం లోని కార్మికులకు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం నెలకి పదివేలు చొప్పున పది నెలలు సాయం అందించాలని కోరారు. ప్రజల అందరికీ కరోనా వ్యాక్సినేషన్ వేయాలని అన్నారు.

ఈ రోజు దేశవ్యాప్తంగా ఆషా వర్కర్స్ సమ్మె పిలుపునిచ్చాయని, తక్షణమే స్పందించి ఆషాలను పర్మినెంట్ చేయాలని,అప్పటి వరకు 21000 రూపాయలు ఇయ్యాలని, ఈనెల 26న, జూనియర్ డాక్టర్లు రాష్ట్రంలో సమ్మెకు పిలుపునిచ్చారని, రాష్ట్రంలో లాక్ డౌన్ సమయంలో ఇలాంటి  సమ్మెలు జరగకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి వారి సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా కార్యవర్గ సభ్యుడు యల్క సోమయ్య గౌడ్, దిన కూలి యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శి సామల కోటమ్మ, మొదాల గోపమ్మ, చంద్రకళ, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మరో సారి రణరంగం గా మారిన ఓయూ ఆర్ట్స్ కళాశాల

Satyam NEWS

భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై విజయవాడలో ధర్నా

Satyam NEWS

అధికార వైసీపీ దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోం

Satyam NEWS

Leave a Comment