33.2 C
Hyderabad
April 26, 2024 01: 36 AM
Slider నల్గొండ

శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని రైస్ మిల్లు యాజమాన్యాన్ని కోరిన కార్మికులు

#CITUHujurnagar2

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రైస్ మిల్లులలో పనిచేసే డ్రైవర్ల వేతనాలు పెంచేందుకు నేడు చర్చలు జరిగాయి.

ఈ చర్చల్లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషిపతి,టీఆర్ఎస్ కె.వి నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్, ఐఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య కార్మిక సంఘాలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలిశెట్టి లక్ష్మీ నరసింహారావు, కార్యదర్శి  సింగర్ కొండ శ్రీనివాస్, గజ్జి ప్రభాకర్ కుక్కడపు రామ్మోహన్ రావు, గెల్లి అప్పారావు, కుక్కడపు కోటేశ్వరరావు పాల్గొన్నారు. రైస్ మిల్ యాజమాన్యం కార్మికులకు రెండు వేల రూపాయలు పెంచుటకు సిద్ధంగా ఉందని తెలుపగా కార్మిక సంఘాల నాయకులు నిత్యావసర ధరలు రోజురోజుకు పెరుగుతున్నందున కార్మికుల శ్రమకు తగ్గ ప్రతి ఫలితం ఉండాలని సుమారు 2500 రూపాయల వేతనం పెంచాలని కోరారు.

యాజమాన్యానికి,కార్మికులకు మధ్య జరిగిన చర్చలు సఫలీకృతం కాకపోవడంతో కార్మికులు వెనుదిరిగారు. ఈ నెల 19వ, తేదీ లోపల రైస్ మిల్లు యాజమాన్యం తమను పిలిచి చర్చలు జరిపి వేతనాలు పెంచాలని, లేని పక్షంలో 20వ, తేదీ నుండి కార్మికులందరూ సమ్మెకు పిలుపునిస్తామని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు యాజమాన్యానికి  తెలిపామని అన్నారు.

ఈ కార్యక్రమంలో గుండెబోయిన వెంకన్న,అంజి ,వెంకన్న,చింతకాయల మల్లయ్య , సైదులు, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రీవారి ఆలయంలో రేపు కైశికద్వాదశి ఆస్థానం వేడుక

Satyam NEWS

పాపం 40 మంది పిల్లలు:వికటించిన మధ్యాహ్న భోజనం

Satyam NEWS

బాబాయి హత్య: ఇంకా వెలుగులోకి రావాల్సిన నిజాలు ఎన్నో

Bhavani

Leave a Comment