40.2 C
Hyderabad
April 19, 2024 18: 04 PM
Slider నిజామాబాద్

జుక్కల్ కస్తూర్బ సిబ్బంది కి ఘనంగా సన్మానం

#kasturba

అంతర్జాతీయ మహిళా దినోత్సవన్ని పురస్కరించుకొని బుధవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ కస్తూర్బ గాంధీ బాలికల గురుకుల పాఠశాల సిబ్బందిని సి ఐ టి యు జిల్లా కమిటి ఘనంగా సన్మానించింది. ప్రిన్సిపాల్ తో బాటు ఉపాధ్యాయునిలు పాఠశాల లో ఆయాలుగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కి సి ఐ టి యు జిల్లా కమిటి సభ్యులు, బస్వాపూర్ మాజి సర్పంచ్ సురేష్ గొండ శాలువాలు కప్పి సన్మానించారు.

స్వీట్ లు పంచి మహిళా దినోత్సవ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సురేష్ గొండ మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాల్లో 35% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. సృష్టికి మూలం అమ్మ, ఈ జీవితానికి మూలం అమ్మ,అసలు ఈ స్త్రీ లేకపోతే సృష్టే లేదని జీవనికి మూల ధరమైన మహిళా మూర్తులందరి కి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా మరోసారి శుభాకాంక్షలు అని తెలిపారు. ఎక్కడైతే మహిళలు పూజించబడతారో ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుందని అయన అన్నారు.

మహిళలనే వారు లేకపోతే పురుషులు ఎందులో అభ్యున్నతి సాధించలేరని ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక కూతురిగా ఉంటు అందర్నీ తన వాళ్లుగా నిస్వార్ధంగా భావించి సేవ చేసే గుణం ఒక్క స్త్రీ లో మాత్రమే ఉంటుందని అన్నారు. ఎక్కడ స్త్రీ కి సరైన గౌరవం ఇవ్వబడుతుందో అక్కడ సకల కార్య సిద్ది జరిగి తీరుతుందన్నారు. కార్యక్రమం లో పాఠశాల నిర్వాహకురాలు అశ్విని,ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు కంబ్లె అజయ్, ఆడేప్ప, మండల అధ్యక్షుడు ఫీర్దోష్,ఉపాధ్యాయునిలు ఆయలు సిబ్బంది పాల్గొన్నారు.

జి. లాలయ్య, సత్యం న్యూస్, జుక్కల్

Related posts

తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో ర్యాగింగ్ భూతం

Satyam NEWS

బాబు కోసం “సహస్ర దీపార్చన”…!

Satyam NEWS

అర్ధరాత్రి కస్తూరిబా గాంధీ విద్యార్థినులను పరామర్శించిన మంత్రి

Bhavani

Leave a Comment