28.2 C
Hyderabad
April 20, 2024 12: 39 PM
Slider నల్గొండ

అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలి

#CITU

ప్రపంచ కార్మికుల పండగ మే డే సందర్భంగా కరోనా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ పరిశ్రమ ప్రాంత కార్మిక వార్డులో జెండా ఎగురవేయాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సి ఐ టి యు పట్టణ మండల కమిటీ సమావేశం ఎలక సోమయ్య గౌడ్ అధ్యక్షతన స్థానిక భవన నిర్మాణ కార్మిక సంఘం బిల్లింగ్ లో జరిగింది.ఈ సందర్భంగా రోషపతి మాట్లాడుతూ ఒకపక్క భారతదేశం లోని రాష్ట్రాలు మొత్తం కరోనా సంక్షోభంలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతుంటే వారికి కావలసిన ఔషధ, ఆక్సిజన్ సౌకర్యాల కోసం ప్రయత్నం చేయకుండా బీజేపీ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టించుకోకుండా పెట్టుబడిదారుల బాగు కోసం ప్రయత్నించటం హేయమైన చర్య అని అన్నారు.

అసంఘటిత రంగ కార్మికులకు కరోనా సందర్భంగా గతంలో వాగ్ధానం చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఇవ్వకపోయినా ఇప్పుడైనా ప్రతి ఒక్కరికి నెలకి 10 వేల రూపాయల చొప్పున సంవత్సరం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అర్హులైన తెల్ల రేషన్ కార్డుల వారందరికి మనిషి 10 కేజీలు సన్నబియ్యం,పప్పు,పంచదార,ఇతర నిత్యావసర వస్తువులను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేసినారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కరోనా కాలంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న మున్సిపల్ వర్కర్స్ కి, గ్రామపంచాయతీ వర్కర్స్ కి, నెలకు ఐదు వేలు చొప్పున అదనముగా ఒక సంవత్సరం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు,భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షుడు ఉప్పతల వెంకన్న, దుర్గారావు, కోటమ్మ, వీరబాబు, గోపి, బిక్షం, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Related posts

బాసర త్రిబుల్ ఐటీ కి ఎంపికైన విద్యార్థులను అభినందించిన శానంపూడి

Satyam NEWS

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట కన్నుమూత

Bhavani

57 ఏండ్లు నిండిన వారు ఆసరా పింఛన్ కు  దరఖాస్తు చేసుకోండి

Satyam NEWS

Leave a Comment