37.2 C
Hyderabad
March 29, 2024 19: 43 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ లో సిఐటియు జీప్ జాత విజయవంతం

#CITU

కృష్ణ పట్టే ఏరియా సిమెంట్ క్లస్టర్ కమిటీ ఆధ్వర్యంలో జీప్ జాత విజయవంతం అయిందని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి తెలిపారు.

శనివారం ఉదయం ముగింపు సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రోషపతి మాట్లాడుతూ జనాభాలో ఒక్క శాతం మంది కోసం పనిచేసే ప్రభుత్వం విధానాలు మనకొద్దు 99 శాతం మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధానాలే మనకు కావాలని అన్నారు.కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను తక్షణమే  రద్దుపర్చి కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కనీస వేతనాల సలహా మండలి 2014 – 16 సంవత్సరంలో తీర్మానాలు ప్రభుత్వాలకు ఇచ్చినా జివో విడుదల చేయలేదని,ఇది అన్యాయమని అన్నారు.    వివిధ పరిశ్రమల్లో కాంట్రాక్టు కార్మికులను కలవడం జరిగిందని,ఈ సందర్భంగా కొన్ని పరిశ్రమలలో ఈనెల 8న,జరిగే రాష్ట్ర వ్యాప్తంగా సి ఐ టి యు ఇచ్చిన పిలుపులో భాగంగా సమ్మె నోటీసులు కూడా కొన్ని పరిశ్రమలకు ఇవ్వడం జరిగిందని అన్నారు. సిమెంట్ పరిశ్రమ కార్మికులు తమ సమస్యలు అనేకం చెప్పడం జరిగిందని అన్నారు.

ఈ యాత్ర విజయవంతం చేసిన కార్మికులు,సహకరించిన మిత్రులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్మికుల సమస్యలపై మరొకసారి రాష్ట్ర కమిటీ నిర్ణయంతో ఈనెల 8వ,తేదీన అనంతరం పోరాటం చేయడానికి సమాయత్తం కావాలని కార్మికులను కోరారు.

ఈ కార్యక్రమంలో పలు పరిశ్రమల కార్మికులు,సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యుడు యలక సోమయ్య గౌడ్, తీగల శ్రీను,ప్రకాష్,లక్ష్మయ్య,సైదయ్య,రాజశేఖర్, శౌరీ,బాబు మేస్త్రి, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్ 

Related posts

మహిళల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ తో శిక్షణ ఐఏఎస్ ల భేటీ

Bhavani

చంద్రబాబు విదేశీ పర్యటన ఖర్చుపై ఆర్టీఐ కింద విచారణ

Satyam NEWS

Leave a Comment