27.7 C
Hyderabad
April 26, 2024 03: 48 AM
Slider నల్గొండ

ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు పరం చేయటం అనుచితమైన చర్య

#CITU

బిజెపి ప్రభుత్వం తక్షణమే నిర్భంధ అణచివేత,విచ్ఛిన్న అరాచకం నిలుపుదల చేయాలని,లేని పక్షంలో ప్రజలు తిరుగుబాటు చేస్తారని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు. 

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సి ఐ టి యు ఆధ్వర్యంలో సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ, గోబ్యాక్ మోడీ, సాగు చట్టాలను రద్దు చేయాలి, కార్మిక చట్టాల సవరణ నిలుపుదల చేయాలి,ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని నినాదాలు చేస్తూ నిరసన తెలియజేసినారు.

ఈ సందర్భంగా రోషపతి మాట్లాడుతూ 11వ, పి ఆర్ సి ప్రకారం వేతనాలు తక్షణమే మున్సిపల్ కార్మికులకు జూన్ నెల నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  ఆణిముత్యం లాంటి భారతదేశ సంస్థలైన ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, రైల్వే, ఓడరేవులు, బొగ్గు గనులు, తదితర వాటిని ప్రైవేటు పరం చేయడం అన్యాయమని,ఇది ప్రజల ఆస్తి అని, ఈ ఆస్తిని ప్రజలు కాపాడుకోవాలని కోరారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలూ,నిరసనల విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా కార్యవర్గ సభ్యుడు యలక సోమయ్య గౌడ్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శులు ముత్తమ్మ, మెరుగు దుర్గారావు,సైదులు,కుమారి,పుల్లయ్య,గోపీ, చంటి, వెంకటరమణ, దేవకరుణ, పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈటలకు బ్రహ్మరథం పట్టిన హుజురాబాద్ ప్రజలు

Satyam NEWS

నార్ముల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయభేరీ

Satyam NEWS

రెండో మ్యాచ్‌లోనూ ఉతికారేసిన ఇండియా

Sub Editor

Leave a Comment