39.2 C
Hyderabad
April 23, 2024 17: 06 PM
Slider నల్గొండ

ప్రమాదవశాత్తూ మరణించిన కార్మికురాలికి సిఐటియు అశ్రునివాళి

#citu

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని ప్రమీల రైస్  ఇండస్ట్రీలో ఈ నెల 25వ,తేదీన సాయంత్రం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో మృతి చెందిన దిన కూలి సిఐటియు యూనియన్ నాయకురాలు పసుపులేటి మున్ని(38) కి సంతాప సూచికంగా మంగళవారం రైస్ మిల్లులో అన్ని పనులు బంద్ చేసి రైస్ మిల్ దినకూలీలు, మిల్లు డ్రైవర్లు, హమాలీలు పాల్గొని నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా  సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణం లోని ప్రమీల రైస్ మిల్లులో రోజు కూలిగా పనిచేస్తూ నూతనంగా కట్టిన గోడకు క్యూరింగ్ కొరకు నీళ్లు కొడుతుండగా కరెంట్ షాక్ తో ప్రమాద వశాత్తూ మరణించటం దురదృష్టకరమని అన్నారు. సిఐటియు, టిఆర్ఎస్కెవి,ఐ ఎన్ టి యు సి,ఐఎఫ్టియు నాయకులు కలిసి యాజమాన్యంతో చర్చించి వారి కుటుంబానికి ఇన్సూరెన్స్,రావాల్సిన ఇతర అలవెన్స్ లతో పాటు ఆర్థికంగా వారి కుటుంబన్ని ఆదుకుంటామని యాజమాన్యం హామీ ఇచ్చారని రోషపతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు యలక సోమయ్య గౌడ్, సామల కోటమ్మ,దుర్గారావు,ఆకం కోటేశ్వరావు, కనకయ్య, టిఆర్ఎస్ కెవి నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్,సిపిఎం పట్టణ కార్యదర్శి నాగారం పాండు,ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకుల మేకల నాగేశ్వరరావు,ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య,గోపమ్మ, కోటేశ్వరరావు,కనకయ్య,రేడితి,ఎడ్ల విజయ్,సైదులు రేదితి వెంకన్న, చింతకాయల మల్లయ్య,చలికంటి జానయ్య,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

ఓదెల రైల్వేస్టేషన్’ వశిష్ట సింహ లుక్ విడుదల

Sub Editor

సీనియర్ జర్నలిస్ట్  అంకబాబు అరెస్టు అక్రమం

Satyam NEWS

నాట్అగైన్:అనువాదంలో పొరపాటుఫేస్‌బుక్ క్షమాపణలు

Satyam NEWS

Leave a Comment