30.3 C
Hyderabad
April 16, 2021 13: 08 PM
Slider సినిమా

కరోనా సోకడంపై వివరణ ఇచ్చిన అల్లూ అరవింద్

కరోనా సోకడంపై వివరణ ఇచ్చిన అల్లూ అరవింద్ తాను కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా వచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రముఖ నిర్మాత అల్లూ అరవింద్ స్పష్టం చేశారు.

తాను ఒక డోసు మాత్రమే తీసుకున్నారని ఆయన తెలిపారు. ఒక డోసు తీసుకున్న తర్వాత ఇద్దరు మిత్రులతో కలిసి తాను ఊరికి వెళ్లి వచ్చారనని ఆయన తెలిపారు.

ఊరికి వెళ్లి వచ్చిన తమ ముగ్గురికి కరోనా వచ్చిందని, అయితే తాను మరొక మిత్రుడు ఒక డోసు తీసుకుని ఉన్నందున తమ ఇద్దరికి కరోనా సోకినా తీవ్రత లేదని అల్లూ అరవింద్ తెలిపారు.

కేవలం తమ ఇద్దరికి కరోనా కారణంగా స్వల్పంగా జ్వరం వచ్చి పోయిందని ఆయన వివరించారు.

మూడో మిత్రుడు కరోనా వ్యాక్సిన్ ఒక డోసు కూడా తీసుకోలేదని, ఇప్పుడు ఆయన కరోనా తీవ్రతతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని అల్లూ అరవింద్ వివరించారు.

వ్యాక్సిన్ తీసుకున్నవారికి కరోనా తీవ్రత ఉండదని చెప్పడానికి తానే ఉదాహరణ అని ఆయన తెలిపారు.

Related posts

జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేత‌నం రూ. 3 వేలు పెంపు

Sub Editor

ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే

Satyam NEWS

వెల్ కం: బాసర అమ్మవారి పుట్టిన రోజుకు రండి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!