39.2 C
Hyderabad
April 23, 2024 16: 06 PM
Slider మహబూబ్ నగర్

చదువుల తల్లికి క్లాస్ మెట్ క్లబ్ ఆసరా

#Classmate Club

ఎవరు ఎలా పోతే మనకేంటి అనుకునే ఈ లోకంలో చక్కగా చదువుకునే పేదవారిని ఆదుకుందాం అని ఎవరికైనా ఉంటుందా? ఉంటుంది నాగర్ కర్నూల్ జిల్లాకొల్లాపూర్ పట్టణానికి చెందిన క్లాస్ మెట్ క్లబ్ ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని చేసింది.

గతంలో కూడా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేసిన క్లాస్ మెట్ క్లబ్ ఈ సారి పేదింట్లో పుట్టిన చదువుల సరస్వతి కి సాయం చేసింది. పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తూ,మరో వైపు ఆర్థికభారం మోస్తూ సతమతం అవుతున్న కొల్లాపూర్ నివాసి పేదింటి సరస్వతీ పుత్రిక వాసంతి  అనే అమ్మాయి ఇంటికి వెళ్లి  చదువు ఖర్చుల నిమిత్తం 10,000/- క్లాస్ మెట్ క్లబ్ అందచేసింది.

ఈ సందర్బంగా క్లాస్ మెట్ క్లబ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బృంగి కృష్ణప్రసాద్, స్థానిక డివిజన్ అధ్యక్షులు అర్థం రవి లు మాట్లాడుతూ సేవే పరమావధి గా ముందుకు వెళుతున్న క్లాస్మేట్ క్లబ్ కులమత లింగ వర్గ వైషమ్యాలు లేకుండా సమాజంలో మంచిని పెంచుతూ, మనిషి లో మానవత్వాన్ని పరిమళింపజేస్తూ రాబోయే తరం పునాదుల్ని దృఢంగా వేస్తూ, ముందుకు కదులుతున్నాం అన్నారు.

విరాళంగా ఇచ్చిన 10 వేల రూపాయలను 1.సుధారాణి 5000/- 2.వాస రాఘవేందర్ 2500/- 3.బృంగి కృష్ణప్రసాద్ 2500/- వంతున అందచేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో డివిజన్ ఉపాధ్యక్షులు ఆకుతోట రాజశేఖర్, కంభం నరేష్ డివిజన్ కార్యదర్శులు శంకర్ గౌడ్, కాశిపురం మహేష్, క్లబ్ సలహాదారులు ఆకుతోట సుదర్శన్, సభ్యులు కిరణ్ పాల్గొన్నారు..

Related posts

పీ.సీ సర్కార్ జ‌న్మ‌దినం..ప్ర‌ముఖ మెజీషియ‌న్ల‌చే ప్ర‌ద‌ర్శ‌న…!

Satyam NEWS

పటిష్ట నిఘా

Murali Krishna

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌ 296 కోట్లు

Satyam NEWS

Leave a Comment