27.7 C
Hyderabad
April 18, 2024 07: 21 AM
Slider వరంగల్

గుడి, బడి, గ్రామం ఆహ్లాదకరంగా ఉండాలి

#Mulugu Zilla Parishad

ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ కన్నాయిగూడెం మండలంలో నేడు పర్యటించారు. అందులో భాగంగా ముప్పనపల్లి గ్రామ పంచాయితి పరిదిలో ఏర్పాటుచేసిన నర్సరీని, పల్లె ప్రకృతి వనాన్ని స్థానిక సర్పంచ్ సుమన్, మండల పంచాయితి అధికారి కుమార్, ముప్పనపల్లి కార్యదర్శి లక్ష్మినారాయణ తో కలిసి పరిశీలించి, మండలలోని గ్రామపనచాయతీల స్థితి గతులను mpo ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గుడి బడితో సమానంగా గ్రామాలలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను, నర్సరీల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించిందని గ్రామంలోని ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సమయం గడిపేందుకు ఈ పల్లె ప్రకృతి వనాలు దోహదపడుతాయని  ఈ రోజు గ్రామాలలో జరుగుతున్న అభివృద్ది దేశానికి తలమానికంగా ఉందని ఆయన అన్నారు.

మూఢ నమ్మకాలు విడనాడాలి

ఈ రోజు ముప్పనపల్లి గ్రామ పంచాయితిలో పర్యటించిన ఆయన  అదే గ్రామ పంచాయితి పరిధిలో గత కొంతకాలంగా గుర్తు తెలియని వ్యాధితో మరణిస్తున్న   విషయం వార్తా కథనాలలో ప్రచురితం కాగా స్పందించిన ఆయన వారి కుటుంబాల ను పరామర్శించి మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 వేల ఆర్థిక సహాయం నగదు రూపంలో అందజేశారు.

అదే విధంగా అక్కడ వైద్య శాఖ ఏర్పాటుచేసిన హెల్త్ క్యాంపును ఆయన పరిశీలించి అక్కడ విధులు నిర్వర్తిస్తున్న హెల్త్ అసిస్టెంట్ లక్ష్మా ను ఇక్కడ మృతి చెందిన వారి వివరాల గురించి వైద్యశాక వారు చేపట్టిన చర్యల గురించిన  సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ మూఢ నమ్మకాలు నమ్మరాదని ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్న దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని , వైద్యం అందుబాటులో ఉంటుందని వారికి సూచించారు.మృతుల కుటుంబాలకు సంక్షేమ పథకాల్లో ప్రధమ ప్రాధాన్యత కల్పిస్తామని ,వారి కుటుంబాల్లోని పిల్లలకు ఉచిత విద్య అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం మృతుల కుటుంబ సభ్యులైన వెంకటేష్ , శిరీష, జ్యోతి , బుచ్చయ్య, నరేందర్ లకు ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని నగదు రూపంలో వారికి అందజేశారు. జడ్పీ చైర్మన్ వెంట కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండలాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుబ్బుల సమ్మయ్య,

గడదాసు సునిల్ కుమార్ , పిఎసిఎస్ చైర్మన్ అశోక్, గోవిందు నాయక్,చిన్న కృష్ణ, నారాయణ, మల్లారెడ్డి , ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, మేడారం ట్రస్టు బోర్డు చైర్మన్ ఆలెం రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Related posts

IMF నుంచి తప్పుకోనున్న చీఫ్ ఎకాన‌మిస్ట్‌ గీతా గోపినాథ్

Sub Editor

జగనన్నా… ఏపీ మోడల్ స్కూల్ ని కాపాడండి

Satyam NEWS

మినీ మేడారం జాతరకు వైద్య శిబిరం సిద్ధం

Satyam NEWS

Leave a Comment