ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని ఏపి సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుభ్రమైన తాగునీటి సరఫరాపై అధికారులతో నేeడు సీఎం సమీక్ష జరిపారు. వాటర్ గ్రిట్ పథకం కింద మూడు దశల్లో పనులు చేపట్టాలని ఆయన ఆదేశించారు.మొదటి దశలో శ్రీకాకుళం, తూర్పుగోదావరి , పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో పరిశుభ్రమైన తాగునీటి వసతి కల్పించాలని, రెండో దశలో విజయనగరం, విశాఖ, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో శుభ్రమైన తాగునీరు అందించాలని సీఎం ఆదేశాలిచ్చారు. మూడో విడతలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో శుభ్రమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.నీటిని తీసుకున్న చోటే శుద్దిచేసి అక్కడ నుంచి పంపిణీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై నిశిత అధ్యయనం చేసి, ప్రణాళిక ఖరారు చేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఉన్న తాగునీటి చెరువులు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. అందులో తాగునీరు నింపాక కలుషితం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై తగిన ఆలోచనలు చేయాలని సీఎం కోరారు. కిడ్నీ బాధిత ప్రాంతాల్లో ట్రీట్ మెంట్‌ప్లాంట్ నుంచి నేరుగా ఇళ్లకే తాగునీటిని పంపిణీచేయాలని సీఎం కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, సీనియర్ అధికారులు, తూ.గో, ప.గో జిల్లాల కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు.
previous post
next post