36.2 C
Hyderabad
April 23, 2024 20: 51 PM
Slider ఆదిలాబాద్

పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనకు ఆరోగ్యం

nirmal minister

మన ఇల్లు మన వీధి మన పట్టణం అనే భావనతో ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని జొహ్రనగర్ ఎంసిహెచ్ ప్రసూతి ఆస్పత్రి ప్రక్కన గల ఖాళీ స్థలంలో మున్సిపల్ చేపట్టిన శ్రమదానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ మన ఇల్లు మన వీధి మన పట్టణం అనే భావన కలిగి ఉండాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే రోగాలు దరిచేరవని అన్నారు. విదేశాలలో రోడ్డు మీద చెత్త చెత్త వేస్తే జరిమానా విధిస్తారని అందువల్ల అక్కడ రోడ్ల మీద ఎవరూ కూడా చెత్త వేయరని అన్నారు.

పల్లెలను పచ్చదనం పరిశుభ్రత తో విరాజిల్లే ల ముఖ్యమంత్రి గతంలో 30 రోజులపాటు పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి ప్రతి గ్రామాన్ని పచ్చదనం పరిశుభ్రత కళకళలాడేలా చేశారన్నారు. పట్టణాలలో  కూడా  పారిశుద్ధ్యం , పచ్చదనం పెంపొందించేందుకు ఫిబ్రవరి 24 నుండి మార్చి 4 వరకు తన ప్రతి కార్యక్రమం చేపట్టామన్నారు.

పరిశుభ్రత ఉంటే ఎలాంటి రోగాలు దరిచేరవని ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రజల తోడ్పాటు అవసరమన్నారు. మున్సిపల్ చైర్మన్, కమిషనర్, మున్సిపల్ కార్యాలయం సిబ్బంది అటెండర్ నుంచి అధికారి స్థాయి వరకు పట్టణ ప్రగతి శ్రమదానం లో పాల్గొనడం అభినందనీయమన్నారు.

ఇదే కాన్సెప్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదానం కార్యక్రమంలో  పాల్గొనాలి అన్నారు. అనంతరం మంత్రి ప్రసూతి ఆస్పత్రిలోని పలు వార్డులను సందర్శించినారు. ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ వార్డులో ఉన్న రోగులను కలిసి వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కాన్పుల విభాగంలో సందర్శించి బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ, మున్సిపల్ చైర్ పర్సన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏరవోతు రాజేందర్, ఎఫ్ ఎస్ సి ఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్, కౌన్సిలర్ మహమ్మద్ సలీం, జిల్లా ఆస్పత్రి డాక్టర్ సురేష్,  ప్రసూతి ఆసుపత్రి ఆర్ ఎం ఓ డాక్టర్ రజని , ఎలక్ట్రిసిటీ ఎస్ ఈ చౌహన్, మున్సిపల్ కమిషనర్ ఎన్  బాలకృష్ణ, పట్టణ ప్రగతి సూపర్వైజర్ అధికారి కోటేశ్వరరావు, మున్సిపల్ డి ఈ సంతోష్ కుమార్, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ రూపకర్త సీఎం

Sub Editor

రైతు సమస్యలు అర్ధం చేసుకుని పని చేయాలి          

Satyam NEWS

క్లస్టర్ కు ఎస్ఐ 30 మంది కానిస్టేబుళ్లు

Murali Krishna

Leave a Comment