28.2 C
Hyderabad
April 20, 2024 13: 23 PM
Slider చిత్తూరు

తిరుపతిలో మద్యం దుకాణాలు మూసివేయాలి

#Naveenkumar Reddy TTD

పవిత్రమైన తిరుపతి నగరంలో మద్యం దుకాణాలను పూర్తిగా మూసేయాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమర్ రెడ్డి కోరారు. లాక్ డౌన్ కు ఆర్థికంగా నష్టపోతున్నా అన్ని వర్గాల ప్రజలు, తిరుపతి వ్యాపారస్తులు అధికారులకు సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. అయితే తిరుపతిలో మద్యం షాపులను లాక్ డౌన్ సమయంలో అనుమతించడం కారణంగా అధికారులు వ్యాపారస్తులు స్థానిక ప్రజల ఆశయం”బూడిదలో పోసిన పన్నీరు” లా మారిందని ఆయన అన్నారు.

తిరుపతి నగరంలోని 34 ప్రభుత్వ మద్యం షాపులను ఉదయం 6 నుంచి 11 గంటల వరకు తెరవడం పై జిల్లా కలెక్టర్ పునరాలోచించాలని ఆయన కోరారు. నిత్యావసర వస్తువులకు సమయం కేటాయించిన విధంగా ఉదయం 6 నుంచి 11 వరకు మద్యం దుకాణాలను కూడా అనుమతించడంతో భౌతిక దూరం మాస్కులు లేకుండా గుంపులుగా చేరుతున్నారని తద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Related posts

ఘనంగా జరుగుతున్న సిబిఐటి శృతి 2023 వేడుకలు

Satyam NEWS

ఆటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

Satyam NEWS

సాడ్ న్యూస్:టీడీపీ నేత బడేటి బుజ్జి హఠాన్మరణం

Satyam NEWS

Leave a Comment