33.2 C
Hyderabad
April 26, 2024 01: 24 AM
Slider హైదరాబాద్

క్లాత్ బ్యాగ్ ల వల్ల మహిళలకు ఉపాధి అవకాశం

#amberpetmla

ప్రణవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శివరాత్రి రోజున పండ్ల పంపిణీ కార్యక్రమానికి ఉపయోగించే క్లాత్ బ్యాగులను అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నేడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అని ప్రతి షాపులలో ప్రతి బండిలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలని అన్నారు.

అంబర్పేట్ నియోజకవర్గంలో ప్లాస్టిక్ కవర్లను నివారించి క్లాత్ బ్యాగులను ఉపయోగించే విధంగా, ప్రజలకు అవగాహన కల్పించడంలో తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. క్లాత్ బ్యాగ్ ల వల్ల మన అంబర్పేట్ నియోజకవర్గంలోని మహిళలకు ఉపాధి అవకాశం దొరుకుతుందని ఆయన అన్నారు. పొదుపు గ్రూపులు సమైక్య గ్రూపులకు మహిళలకు ఉపాధి అవకాశం కోసం క్లాత్ బ్యాగుల తయారీ కేంద్రాన్ని అలాగే దాని అమ్మకాన్ని ఆర్థికంగా ఎదగడానికి ఎమ్మెల్యే సహకరిస్తానని అన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రణవి ఫౌండేషన్ వ్యవస్థాపకులు జైన్ కుమార్ విశ్వకర్మ, తెలంగాణ ఇంచార్జ్ ఆనంద్ చారి, శ్రీ విశ్వ బ్రాహ్మణ సమైక్య సంఘం అంబర్పేట్ అసెంబ్లీ అధ్యక్షులు గన్నోజు కృష్ణ చారి, చైర్మెన్ శ్రీరామ చారి, సంతోష్ చారి, ప్రణవి ఫౌండేషన్ సభ్యులు భాగ్య, సాయినాథ్, రమేష్ నాయక్, తారకేశ్వరి, కృష్ణ శర్మ, వెంకట్,  టిఆర్ఎస్ పార్టీ నాయకులు అంబర్ పేట్ డివిజన్ అధికార ప్రతినిధి మహేష్ ముదిరాజ్,వేణు, సంతోష్ చారి,తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

సీఎం కేసీఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాలి

Satyam NEWS

త్వరలోనే జేఈఈ మెయిన్‌ నోటిఫికేషన్‌

Murali Krishna

చిన్నారెడ్డికి టికెట్ ఇవ్వొద్దు

Satyam NEWS

Leave a Comment