31.7 C
Hyderabad
April 18, 2024 23: 22 PM
Slider ముఖ్యంశాలు

కరోనా పేరుతో దోచుకుంటున్న ప్రయివేట్ ఆసుపత్రులు

#CLPLeader

రాష్ట్రంలో చేతగాని ప్రభుత్వం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు అన్నారు. కేసీఆర్ చేతగాని పాలన వల్ల తెలంగాణలో కరోనా మరణాలు సంభవించాయని ఆయన మండిపడ్డారు. శనివారం భట్టి విక్రమార్క మల్లు గాంధీ భవన్ ఆవరణలోని ఇందిరాభవన్ లో జరిగిన ప్రెస్ మీట్  మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొడెం వీరయ్య, జగ్గారెడ్డి, సీతక్క, కాంగ్రెస్ నాయకులు బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ  ఆసుపత్రుల పర్యటన అనంతరం ఆయన పర్యటన వివరాలు మీడియాకు వెల్లడిస్తూ తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రల్లో ఎక్కడా వైద్యులు, సహాయ సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్ లేరని చెప్పారు.

కరోనా పెండామిక్ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలించి, పేదలు పడుతున్న ఇబ్బందులు గమనించి రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకువచ్చే ఉద్దేశంతోనే మీడియా సమావేశం, ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించినట్లు ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అతి తక్కువ సిబ్బందితో కరోనాను వైద్యులు బాగా ఎదుర్కోన్నారని అన్నారు. వైద్యసిబ్బందికి, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు పీపీఈ కిట్లు అందించకపోయినా.. వారు ప్రాణాలకు తెగించి వైద్యం అందించారని అన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని, ప్రజల్ని గాలికి వదిలేసిందని భట్టి తీవ్రమైన ఆరోపణలు చేశారు.

తెలంగాణలో ఉన్న ఆసుపత్రలన్నీ గత ప్రభుత్వాలు కట్టినవేనని.. ఈ ఆరున్నర సంవత్సరాలుగా కేసీఆర్ సర్కార్ కొత్తగా కట్టిందేమీ లేదని అన్నారు. ఇన్నేళ్లలో కొత్తగా ఆసుపత్రులకు పరికరాలు అదించింది లేదని.. సిబ్బందిని నియమించింది లేదని అన్నారు. ఎవరైనా కరోనా బారిన పడి ఆసుపత్రికి వస్తే అరకొరగానే పరీక్షలు చేస్తున్నారని ఆయన చెప్పారు. కరోనా వచ్చిన వారిని, లక్షణాలు కనిపించనివారిని హోమ్ క్వారంటైన్ కు పంపుతున్నారని అన్నారు.

ఇలా చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరిగాయని చెప్పారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఐసోలేషన్ క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే కరోనా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్యం షాపులు, బెల్టు షాపుల వల్లే కరోనా పెరిగిందని అన్నారు.

కరోనా పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు పేదలను పీడించి, డబ్బులు వసూలు చేస్తున్నాయని అన్నారు. కేవలం ఒక కరోనా రోగి దగ్గర నుంచి  యశోదా ఆసుపత్రిలో  రూ.29 లక్షల బిల్లు వసూలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైద్యమంత్రి మాత్రం కరోనను కేవలం రూ.10 వేలు మాత్రమే అవుతుందని చెప్పారు.. మరి ఇంటా బిల్లు ఎలా వసూలు చేసారు.. ఎవరు చేయమన్నారు.. అంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు. మొత్తం ఈ పీజులపై ఒక IAS స్థాయి అధికారితో కమిటీ వేసి నియంత్రణ చేయాలని అన్నారు.

Related posts

మూడు ముక్కలాటలో వైసీపీకి జాక్ పాట్

Satyam NEWS

భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆలయం

Satyam NEWS

వివాహ భోజనంబు’లో తొలి పాట ‘ఎబిసిడి…’ విడుదల

Satyam NEWS

Leave a Comment