26.2 C
Hyderabad
February 14, 2025 00: 46 AM
Slider జాతీయం

ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షాపుల్లర్స్ !

#yogiadityanath

రాజకీయ నేతలు చిత్ర విచిత్రమైన వాదనల్ని తెరపైకి తెస్తూ ఉంటారు. ఈ విషయంలో బీజేపీ నేతలు చాలా మందు ఉంటారు. వారు చెప్పే కథలు చాలా వరకూ చరిత్రతో సరిపోలవు. ఏమిటంటే.. అప్పట్లోనే చరిత్రను తప్పుగా నమోదు చేశారని సరిదిద్దుతామని వాదిస్తారు. ఇలాంటి విషయాల్లో యూపీ సీఎం ఆదిత్యానాథ్‌ది ప్రత్యేక శైలి. ఆయన తాజాగా ఓ విషయాన్ని బయట పెట్టారు. అదేమిటంటే మొఘల్ చక్రవర్తిగా ప్రపంచాన్ని ఏలిన ఔరంగజేబు వారసులు ఇప్పుడు కోల్ కతాలో రిక్షా తొక్కుకుని బతుకుతున్నారట.

మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు దేశంపై దండెత్తి చాలా ఆలయాలను ధ్వంసం చేశాడని ఆయనను బీజేపీ వ్యతిరేకిస్తుది. అయితే ఆయన అలా చేశాడన్నదానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయా లేవా అన్నదానిపై చరిత్రకారుల మధ్య చర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ బీజేపీ నేతలు మాత్రం ఆయనను శత్రువుగాప్రకటించేసుకున్నారు . ఆయన వారసులు కోల్ కతాలో ఉన్నారని వారు రిక్షా తొక్కకుంటూ బతుకుతున్నారని ఇది దేవుడి శిక్, అనేస్తున్నారు. అయోధ్యలో ఓ సభలో ప్రసంగించిన ఆయన ఈ కామెంట్లు చేశారు.

ఆదిత్యనాథ్ కామెంట్లు సహజంగానే వైరల్ అయ్యాయి. మొఘలుల వారసులు ఉన్నారని ఎవరూ చెప్పుకోవడం లేదు. ఉన్నారో లేదో కూడా తెలియదు. కానీ ఆదిత్యనాథ్ మాత్రం కోల్ కతాలో రిక్షా తొక్కుకునే వాళ్లను మొఘలుల్ని చేశారు. రాజకీయ నేతలు తల్చుకుంటే ఏమైనా చేయగలరు.. ఎలా అయినా మాట్లాడగలరు.

Related posts

దేశం మెచ్చిన నాయకుడు కెసిఆర్: శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి

Satyam NEWS

కర్ణాటకలో బిజెపి ఓటమి దక్షిణ భారత ప్రజల విజయం

mamatha

చురుకుగా సాగుతున్న స్వచ్ఛ భారత్ మిషన్

Satyam NEWS

Leave a Comment