అసెంబ్లీ సాక్షిగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని దూషించిన ముఖ్యమంత్రికి మహిళల గౌరవం లేదని వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ కౌన్సిలర్, బి.ఆర్.ఎస్ మహిళా నాయకురాలు నందిమల్ల శారద డిమాండ్ చేశారు. చర్చకు సంబంధం లేకుండా వ్యక్తిగత కక్ష్యతో అక్కలను నమ్ముకుంటే ముంచుతారని, అక్కలను నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అనడం అంటే మహిళలందరిని అవమానించినట్లేనని ఈ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారికి తగదని ఆమె దుయ్యబట్టారు.
ఎన్నో పార్టీలు మారిన రేవంత్ రెడ్డి ఒక్క పార్టీ మారిన సబితమ్మను విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు. మహిళా కంట కన్నీరు ఒలికితే రాజ్యలే పోయాయని తస్మాత్ జాగ్రత్త అని శారద హెచ్చరించారు. మహిళలకు ఇచ్చిన హామీలు, యువతులకు స్కూటీలు, బాలింతలకు కె.సి. ఆర్ కిట్టు, స్వయం ఉపాధి అవకాశాలు అంటూ ఓట్లు దండుకుని ఒక్క హామీ కూడా అమలుపర్చకుండా మహిళలను అవమానపరిచరాని విమర్శించారు.
10ఎండ్లలో మహిళలను కంటిరెప్పలా కాపాడిన ఘనత కె.సి.ఆర్ కు దక్కిందని నేడు రాష్ట్రములో మహిళకు భద్రత లేదని,అత్యాచారాలు పెరిగిపోయాయని ఒక్కరోజు రాష్ట్రంలో మూడు లైంగిక దాడులు మహిళపై జరిగాయని, వనస్థలిపురంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై సామూహిక అత్యాచారం, నల్గొండ జిల్లా శాలిగౌరారంలో దివ్యాంగ మహిళపై లైంగికదాడి,ట్రావెల్స్ బస్సులో మహిళపై డ్రైవర్ లైంగిక దాడి జరుగుతుంటే చర్యలు తీసుకోకుండా ఉండడాన్ని శారద ఖండించారు. ముఖ్యమంత్రి చేసిన అవమానానికి కొనసాగింపుగా డిప్యూటీ సి.ఎం భట్టి విక్రమార్క ఏ ముఖం పెట్టుకు ని అసెంబ్లీకి వచ్చారని అనడాన్ని ఖండిస్తూ వెంటనే సబితమ్మకు అసెంబ్లీలో, బహిరంగంగా ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని నందిమల్ల శారద డిమాండ్ చేశారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్