Slider కృష్ణ

నర్సాపురం ఎంపీడీఓ కుటుంబసభ్యులతో మాట్లాడిన సీఎం

#chandrababu

4 రోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయిన నర్సాపురం ఎంపీడీఓ వెంటక రమణారావు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు నాయడు ఫోన్ లో మాట్లాడారు. రమణారావు ఆచూకీ తెలియక నాలుగు రోజుల నుంచి తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. రమణారావు చివరిగా ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఏం చెప్పారు…ఆయన ఒత్తడికి గురవ్వడానికి గల కారణాలు ఏంటి అని సీఎం అడిగి తెలుసుకున్నారు. కొద్ది రోజులుగా వెంకటరమణారావు తీవ్ర ఒత్తిడితో ఉన్నారని…..ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఇబ్బంది పడ్డారని ఆయన సతీమణి సునీత తెలిపారు.

ఆమెతో పాటు, కుమారుడు సాయిరాంతో సీఎం ఫోన్ లో మాట్లాడారు. గతంలో ఎప్పుడైనా ఏవైనా అంశాలు మీ దృష్టికి తెచ్చారా అని సీఎం అడిగారు. ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తామని సీఎం అన్నారు. నిజాయితీ పరుడు, సమర్థుడైన అధికారి ఆచూకీ లేకుండా పోవడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. వెంకట రమణారావు కుటుంబాన్ని ఆదుకుంటామని, ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. బాధిత కుటుంబం వద్ద ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా  కలెక్టర్ నాగరాణి తో కూడా సీఎం మాట్లాడి పలు సూచనలు చేశారు. ఘటనపై లోతుగా దర్యాప్తు జరపాలని….ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు.

Related posts

అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు

Murali Krishna

ట్రంప్ చెత్త పాలనను ఎండగట్టిన పెంటగాన్ మాజీ అధికారి

Satyam NEWS

రామజన్మభూమి మధ్యవర్తిత్వం విఫలం

Satyam NEWS

Leave a Comment