తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగిన బైరాగి పట్టెడ లోని ఎంజీఎం ఉన్నత పాఠశాల వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ కేంద్రానికి పక్కన ఉన్న మునిసిపల్ పార్క్, సదరు స్కూల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ప్రమాద ఘటనపై పరిశీలిస్తూ అధికారులతో పలు వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం మినిస్టర్ అనిత, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు, టిటిడి ఈవో శ్యామలరావు, డీఐజీ షిమోషి బాజ్పాయ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈఓ గౌతమి, పలువురు ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
previous post
next post