26.2 C
Hyderabad
February 13, 2025 22: 27 PM
Slider ప్రత్యేకం

మంత్రి భరత్ పై మండిపడ్డ సీఎం(with Video)

#tgbharat

స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రసంగం సీఎం చంద్రబాబును ఆగ్రహానికి గురిచేసింది. భవిష్యత్తులో ఏపీ ముఖ్యమంత్రి నారా లోకేశ్ గారే అంటూ భరత్ ప్రసంగించారు. ఎవరు కాదన్నా ఇది జరిగి తీరుతుందనే కోణంలో ఆయన వ్యాఖ్యానించారు. ఇదే వేదికపై ఉన్న సీఎం చంద్రబాబు… మంత్రి భరత్ పై మండిపడ్డారు. వ్యక్తిగత అభిప్రాయాలు ఇలాంటి వేదికలపై మాట్లాడొద్దని హెచ్చరించారు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు… మనం వచ్చిన పనేమిటి… మీరు మాట్లాడుతున్నదేమిటి… అసందర్భ ప్రసంగాలు చేయొద్దని మందలించారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు.

Related posts

పని లేని వాళ్లవల్ల పెరుగుతున్న కరోనా

Satyam NEWS

ముఖ్యమంత్రి సహాయ నిధికి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగుల విరాళం

Satyam NEWS

బీహార్ లో ధర్మల్ పవర్ ప్లాంట్ కు రైతుల నిరసన

Satyam NEWS

Leave a Comment