24.7 C
Hyderabad
March 29, 2024 06: 54 AM
Slider నెల్లూరు

సీఎం జగన్ కు బడుగులంటే ప్రేమ

#adana

సీఎం జగన్మోహన్ రెడ్డికి బడుగు వర్గాలంటే ఎంతో ప్రేమని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తే, అందులో 14 మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారని తెలిపారు. కలివెలపాలెంలో బుధవారం సాయంత్రం ఆహ్లాదకరంగా జరిగిన ఆత్మీయ సమావేశంలో  నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏ ప్రాంతంలోనైనా శాంతిని ప్రోత్సహిస్తే, అభివృద్ధి దానంతటదే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. 

గతంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ ప్రాంతం ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేసామని గుర్తు చేసుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో ఈ ప్రాంతంలో పోర్టు, పరిశ్రమలు తెచ్చామని చెప్పారు. అందువల్ల ఈ ప్రాంతం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. నెల్లూరు నగరం కూడా అభివృద్ధి చవి చూసిందన్నారు. గతంలో రూరల్ ఎమ్మెల్యే కి నేను, విజయ కుమార్ రెడ్డి ఎన్నికల్లో ఆర్థికంగానూ, ఇతరత్రా సహకరించామని, అయినా మా పట్ల వివక్షత ప్రదర్శించాడని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ముత్తుకూరుకు ఇంకొక రోడ్డు నిర్మాణం జరగనుందని, అలాగే నెల్లూరుకు రింగ్ రోడ్డు కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఇదే జరిగితే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, జడ్పీ నిధులు, నా ఎంపీ నిధుల నుంచి అభివృద్ధి పనులకు కేటాయిస్తామని తెలిపారు.

స్థానిక నేతల ప్రేమాభిమానాలు

ఆత్మీయ సమావేశంలో స్థానిక ప్రతినిధులు తమ ప్రేమాభిమానాలను వెల్లడించారు. తరతమ భేదాలు లేని వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి అని కొనియాడారు. వర్గాలకు అతీతంగా, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ఆదాలకు ఎప్పుడు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి డిసిసిబి మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి అధ్యక్షత వహించి, గత పరిస్థితులను, ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు.

స్థానిక నేతలు అజయ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, విజయకుమార్, కోసూరు కేశవులు, వెంకటేశ్వర్లు రెడ్డి, వీరారెడ్డి, రవీంద్రరెడ్డి, కిష్టయ్యతో పాటు నాలుగు గ్రామాల నుంచి అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, సుధాకర్ యాదవ్, జివి ప్రసాద్, బట్టేబాటి నరేంద్ర రెడ్డి, అల్లాబక్షు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మదారి కురువ మదాసి కురువ వనపర్తి జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

Satyam NEWS

కొల్లాపూర్ లో మరొక్క సారి జూపల్లి ప్రభంజనం

Satyam NEWS

భక్తులతో క్రిక్కిరిసిపోయిన తిరుమల గిరులు

Satyam NEWS

Leave a Comment