27.7 C
Hyderabad
April 26, 2024 03: 34 AM
Slider గుంటూరు

సీఎం జగన్ కి విద్యా వ్యవస్థపై సరైన అవగాహన లేదు

#nallapatiramu

సీఎం జగన్ కి విద్యా వ్యవస్థపై సరైన అవగాహన లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ (రాము) అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తుగ్లక్ పాలనలో రాష్ట్రం సర్వ నాశనం అయ్యిందని రాము విమర్శించారు. వరల్డ్ బ్యాంక్ ఇచ్చే నిధులకు ఆశపడి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది స్కూళ్లను మూసివేస్తున్నారని, విద్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో విద్యామంత్రి బొత్స సత్యనారాయణ ఒక డమ్మీ మంత్రి అయ్యాడని రాము విమర్శించారు. విద్యావ్యవస్థ గురించి ఏ మాత్రం తెలియని మంత్రి కేవలం జగన్ ఎలా చెబితే అలా విటున్నారని రాము అన్నారు. పేదలకు విద్యను దూరం చేయడమే సీఎం జగన్ ప్రధాన ఉద్దేశం లా కనిపిస్తున్నాని ఆయన తెలిపారు.

విద్యా వ్యవస్థ లో గతంలో మూడవ స్థానంలో రాష్ట్రం ఉంది. ఇప్పుడు చివరి స్థానంకి వెళ్ళిపోయిందని రాము ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

సర్కార్ వారి పాట రూ.400 కోట్లు నిజమా? అబద్దమా

Satyam NEWS

పాకిస్తాన్‌కు దుబాయ్ షాక్ .. కాశ్మీర్‌‌లో భారీ పెట్టుబడులు

Sub Editor

కొత్త చట్టం చక్రాల కింద రైతుల శవాలు

Satyam NEWS

Leave a Comment