36.2 C
Hyderabad
April 24, 2024 22: 14 PM
Slider కడప

నమ్మి ఓట్లేసిన ప్రజలకు మనోవ్యధ మిగిలిస్తున్న జగన్ ప్రభుత్వం

#baburajendraprasad

ఉమ్మడి కడప జిల్లా కడప టౌన్ లో  జరిగిన సర్పంచులు అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు యలమంచిలి వెంకట బాబు రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సి.ఎఫ్.ఎం.ఎస్ పరిధి నుంచి గ్రామ పంచాయతీల ఖాతాలను వేరు చేయాలని డిమాండ్ చేశారు. 

జనరల్ ఫండ్స్ సొంత నిధుల వాడకంపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఫ్రీజింగ్ ను, ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, ఎప్పుడు అవసరం పడితే అప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు సర్పంచులు ఆ జనరల్ ఫండ్స్ నిధులను స్వేచ్ఛగా, సులభంగా వినియోగించుకోనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. అదేవిధంగా సర్పంచులు తమ ను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన తమ గ్రామ ప్రజలకు కావాల్సిన మౌలిక, ప్రాథమిక సౌకర్యాలైన త్రాగు నీరు, రోడ్లు, డ్రైనేజీ,శానిటేషన్,  లైటింగ్ మొదలగునవి ఏర్పాటు చేయలేక తీవ్ర మనోవ్యధకు సర్పంచులు గురవుతున్నారని ఆయన తెలిపారు. ఎన్నికలలో ఎన్నో హామీలిచ్చి గెలిచిన తర్వాత పనులు చేయడం లేదని ప్రజలు సర్పంచుల ను నిందిస్తున్నారని అందుకే సర్పంచులు అధిక వడ్డీలకు అప్పులు చేసి డబ్బులు తీసుకొని వచ్చి గ్రామాలలో పనులు చేశారని అన్నారు.

ఇటీవల 14, 15 వ ఆర్థిక సంఘం నిధులు రూ. 344 కోట్లు, రూ. 969 కోట్లు మొత్తం రూ. 1313 కోట్లను సర్పంచ్ల అకౌంట్ లో నుంచి సర్పంచులకు చెప్పకుండా, సర్పంచుల చెక్కులు మీద సంతకాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసి వేసుకోవడంతో, చేసిన పనులకు బిల్లులు అవ్వక సర్పంచుల అప్పులపాలై… చేసిన అప్పులకు అధిక వడ్డీలు కట్టలేక తీవ్ర మనోవేదనకు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ రోజుకి కూడా సర్పంచులు అధిక వడ్డీలకు అప్పులు చేసి తమ సొంత డబ్బులతో గ్రామాల్లో పనులు చేస్తున్నారని, కానీ బిల్లులు అవ్వక పలు ఇబ్బందులు పడుతున్నారని రాజేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరచి సర్పంచుల విధులు, నిధులు ఇవ్వకపోతే రాష్ట్రంలో ఉన్న సర్పంచులు అందరూ ఏకతాటి పైకి వచ్చి ఉద్యమాలు ఉదృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్. శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి, జమ్మలమడుగు ఇంచార్జ్ దేవగుడి భూపేష్ రెడ్డి, పోతుగంటి పిరయ్య, ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకులు కొత్తపు మునిరెడ్డి, బిర్రు  ప్రతాపరెడ్డి, యేజర్ల వినోద రాజు, సింగంశెట్టి సుబ్బరామయ్య, ముల్లంగి రామకృష్ణారెడ్డి, చుక్క ధనుంజయ్ యాదవ్, అనేపు రామకృష్ణారెడ్డి, బొర్రా నాగరాజు, వానపల్లి ముత్యాలరావు, సిజే కొండయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Related posts

అవసరమైన ప్రత్తి మిరప పంటలకు విత్తనాలు సిద్ధం చేయాలి

Satyam NEWS

ఢిల్లీ ఫలితాల ప్రభావం పౌరసత్వ చట్టంపై ఉండదు

Satyam NEWS

నో అబార్షన్ ప్లీజ్: ఆడపిల్లను చంపితే శిక్ష గ్యారెంటీ

Satyam NEWS

Leave a Comment