25.7 C
Hyderabad
January 15, 2025 18: 09 PM
Slider తెలంగాణ

7న మేడారం జాతరకు వెళ్తున్న సిఎం కేసీఆర్

CM KCR

తెలంగాణ కుంభమేళాగా పేరు పొందిన మేడారం మహా జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 7వ తేదీన వెళుతున్నారు. ఆయన కుటుంబ సమేతంగా వెళ్లి అక్కడ ముక్కులు చెల్లించుకుంటారని తెలిసింది. 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఆయన సమ్మక్క-సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారని ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా సమ్మక్క- సారలమ్మలను దర్శించుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

సిఎం రాక సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తును ఇప్పటికే అధికారులు చేపట్టారు. ఇప్పటికే మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున సమ్మక్క-సారక్కలను దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. లక్షలాది మంది ప్రజలు వనదేవతలను దర్శించుకుని తరిస్తున్నారు. జాతర సందర్భంగా మేడారం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది.

Related posts

రాష్ట్రంలో కార్తీక శోభ

Sub Editor

పింఛన్లు,నిరుద్యోగ భృతి,డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వండి మహాప్రభో

Satyam NEWS

కాంగ్రెస్ లో చేరిన గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్

Satyam NEWS

Leave a Comment