28.2 C
Hyderabad
April 20, 2024 14: 53 PM
Slider ప్రత్యేకం

కెఆర్ఎంబీ సమావేశానికి హాజరు కావాలని సిఎం కెసిఆర్ నిర్ణయం

#Telangana CM KCR

సెప్టెంబర్ 1 న జరగబోయే కెఆర్ఎంబీ సమావేశానికి తెలంగాణ హాజరు కావాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణకు కృష్ణాజలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సిఎం ఆదేశించారు. ఈ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహం పై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

కెఆర్ఎంబీ సమావేశంలో చర్చకురాబోయే ఎజెండా అంశాలపై ప్రగతి భవన్ లో బుధవారం సిఎం కెసిఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో … సీఎస్ సోమేశ్ కుమార్, ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ రజత్ కుమార్, సిఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్ సీ మురళీధర్, సిఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో సీనియర్ న్యాయవాది రవీందర్ రావు, ఇంటర్ స్టేట్ విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్,  సూపరింటెండింగ్ ఇంజనీర్ కోటేశ్వర్ రావు, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ..కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన నీటివాటాకోసం కెఆర్ఎంబీ, ట్రిబ్యునల్స్ సహా అన్నిరకాల వేదికల మీద బలమైన వాదనలు వినిపించాలని పునురుద్ఘాటించారు. సాధికారిక సమాచారంతో కెఆర్ఎంబీ సమావేశంలో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని అధికారులకు సిఎం కెసిఆర్ సూచించారు.

Related posts

ఎడిటర్ ను బెదిరిస్తున్న వారిపై చర్య తీసుకోవాలి

Satyam NEWS

మంత్రివర్గ విస్తరణ దసరానాటికి ఉంటుందా?

Satyam NEWS

కరోనా నివారణకు మాస్కులు ధరించకుంటే చర్యలు

Satyam NEWS

Leave a Comment