33.2 C
Hyderabad
April 26, 2024 01: 30 AM
Slider నల్గొండ

సిఎం కెసిఆర్ ప్రభుత్వ సహకారంతో గ్రామాల అభివృద్ధి

#hujurnagarmunicipality

సిఎం కెసిఆర్ సహకారంతో గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎంపిపి గూడెపు శ్రీనివాస్ అన్నారు.   సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ,మండలం సీతారామపురం గ్రామంలో సిఎం మంజూరు చేసిన ఎస్.డి.ఎఫ్ ఉపాధి నిధులు 25 లక్షలతో సిసి రోడ్డు పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎంపిపి గూడెపు శ్రీనివాసు మాట్లాడుతూ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి  సహాయ సహకారాలతో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ది కెసిఆర్ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని అన్నారు.పేద కుటుంబాలకు అండగా ఉండేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కెసిఆర్ కి దక్కిందని అన్నారు. శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి  నియోజకవర్గానికి ఎత్తిపోతల పథకాలు, ముత్యాల బ్రాంచ్ కాల్వల ఆధునీకరణకు రెండువేల కోట్ల రూపాయలు మంజూరు చేయించారని అన్నారు.పట్టణానికి 6 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు పనులు పూర్తి చేస్తున్నారని,  గ్రామాల్లో ప్రకృతి వనాలు, హరితవనాలు,శ్మశాన వాటికలు, అంతర్గత రోడ్ల నిర్మాణానికి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారని అన్నారు.సిఎం సహాయ నిధి నుండి పది కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేయించిన ఘనత  సైదిరెడ్డి కి  దక్కిందన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ అద్దంకి సైదేశ్వరరావు,ఉప సర్పంచ్ జానకిరామారావు,కార్యదర్శి సుస్మిత, వార్డు సభ్యులు వసంత,మల్లమ్మ,కె. వెంకటేశ్వరరావు,గ్రామ ప్రజలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

Satyam NEWS

సిసి రోడ్డు పనులను పరిశీలించిన ఎంపీడీవో

Satyam NEWS

ఈ నెల 10న పాక్షిక చంద్ర గ్రహణం.. ఈ ఏడాది మరో రెండు

Satyam NEWS

Leave a Comment