27.7 C
Hyderabad
April 18, 2024 10: 26 AM
Slider కరీంనగర్

వ్యాక్సిన్లు కూడా ఇవ్వలేని సీఎం మన కేసీఆర్

#AdiSrinivas

కరోనాను రానివ్వం ఒకవేళ వస్తే వెయ్యి కోట్లతో తరిమికొడతాం అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం వ్యాక్సిన్లు కూడా ఇవ్వలేకపోతున్నారని కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ ఆరోపించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ ఉర్దూ పత్రిక విలేఖరి ఖలీల్ పాషా తండ్రి నేడు అకాల మరణం పొందినందున వారి నివాసానికి చేరుకొని సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆది శ్రీనివాస్ కోరారు.

ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్లు వెయ్యకుండా నిలిపి వేయడం  చూస్తే ఈ ప్రభుత్వానికి కరోనా మహమ్మారి తరిమికొట్టడానికి ఏపాటి శ్రద్ధ  ఉందో అర్థమవుతుందని ఆయన అన్నారు.

వ్యాక్సిన్ ల కొరకు 25 వందల కోట్లు కేటాయించామని చెప్పారు కానీ గత పది రోజులుగా వ్యాక్సిన్లు వేయడం లేదు కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న పేద ప్రజలు కోరుతున్న ఆరోగ్యశ్రీ కి  ఈ కరోనా ను తీసుకోకపోవడంని తప్పు పడుతున్నాం వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చండి అని ఆయన అన్నారు.

పక్క రాష్ట్రంలో కరోనా కు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకుంటున్నారు వెంటనే ఈ ప్రభుత్వం కూడా ఉచిత వైద్యాన్ని అందివ్వాలని ఆయన అన్నారు.

Related posts

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన వసుధ ఫౌండేషన్

Satyam NEWS

బాబూ జగ్జీవన్‌రామ్ కు ఏపీ సిఎం జగన్ ఘన నివాళి

Satyam NEWS

కొల్లాపూర్ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే..సర్కారు వారి పాట రెండు వేల కోట్లు

Satyam NEWS

Leave a Comment