34.2 C
Hyderabad
April 19, 2024 20: 46 PM
Slider ఖమ్మం

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే

#ministerpuvvada

దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వమే పెట్టుబడి ఇచ్చి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతును రాజును చేసి, నవతరాన్ని సైతం సాగువైపు మళ్లించేలా స్పూర్తినిచ్చిన ఒకే ఒక్కడు ముఖ్యమంత్రి కెసీఆర్ అని మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, నిరంజన్ రెడ్డి అన్నారు.

బంగారు తెలంగాణ సాధన దిశగా కేసీఆర్ గారి మానస పుత్రిక రైతుబంధు ద్వారా అన్నదాతలకు అందిన పంట పెట్టుబడి సాయం నేడు రూ.50వేల కోట్లకు చేరనున్న సందర్భంగా ఖమ్మం నగరంలోని బుర్హాన్ పురం కూరగాయల మార్కెట్ నందు AMC చైర్మన్ లక్ష్మిప్రసన్న, రైతుల అధ్వర్యంలో 1800 చదరపు అడుగుల విస్తీర్ణంలో పలు రకాల కూరగాయలతో సీఎం కేసీఆర్ గారి చిత్రపటాన్ని తీర్చిదిద్దారు.

ముఖ్యఅతిధులుగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం, పుష్పాభిషేకం చేశారు. రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారు చూపిన మార్గం సాలు పట్టిన సేద్యం, అన్నదాత ఇంట ధనలక్ష్మిని నింపిందన్నారు.

అకుంఠిత దీక్షతో, చిత్తశుద్ధితో రైతులకు అందించించిన రైతుబంధు సాయం రూ.50వేల కోట్ల మైలురాయిని చేరుకుందన్నారు. ఊరూరా రైతులు పండుగ వాతావరణంలో సంబరాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించి అభిమానాన్ని చాటుతున్నారని వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ V.P.గౌతమ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర్లు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొత్త రెవెన్యూ చట్టం న‌వ శ‌కానికి నాంది

Satyam NEWS

మతకలహాలు రెచ్చగొట్టే సోషల్ మీడియాపై కన్నేసిన పోలీసులు

Satyam NEWS

మీడియా టాప్ ట్రెండింగ్ లో నలుగురు హీరోలు

Satyam NEWS

Leave a Comment