35.2 C
Hyderabad
April 20, 2024 17: 01 PM
Slider తెలంగాణ

రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్

Bhatti-Vikramarka

సీఎం కేసీఆర్ మాటలను చూస్తుంటే రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినట్లు ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పాలన చేయలేక కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించి ప్రైవేటికరణ చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికే మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన కేసీఆర్ రాబోయే రోజుల్లో మరో మూడు లక్షల కోట్లు అప్పులు చేసేటట్లుగా కనిపిస్తున్నదని ఆయన అన్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళిందని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్ అయిన ఆర్టీసీ కేసీఆర్ పాలన 6 ఏండ్లలో దివాలా తీయించి ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆర్టీసీ కార్మికుల మరణాలకు ప్రతిపక్షాలు కారణం కాదని ప్రభుత్వమే కారణమని ఆయన అన్నారు.  కేసీఆర్ గతంలో చెప్పిన హామీలను కార్మికులు అడుగుతున్నారని కొత్త విషయాలు కోరడం లేదని ఆయన స్పష్టం చేశారు.  కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమైనవి అందుకే ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్నాయని ఆయన తెలిపారు.

Related posts

గాయకులతో కలిసి బతుకమ్మ పాటను పాడిన కవిత

Bhavani

సైబర్‌ ఆధారిత నేరాల కట్టడికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం

Bhavani

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?

Satyam NEWS

Leave a Comment