37.2 C
Hyderabad
April 19, 2024 14: 28 PM
Slider నల్గొండ

నిరుద్యోగ భృతి హామీ వెంటనే అమలు చేయాలి

#congress

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ 2018 సంవత్సరం ఎన్నికలలో అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు అక్షరాల 3,116 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారని,దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదన కదలిక లేదని టి.పి.సి.సి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రెటరీ ఎండి.అజీజ్ పాషా అన్నారు.  

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మహ్మద్ అజీజ్ పాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు నిరుద్యోగ భృతి కోసం,ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, వారందరికీ నిరుద్యోగ భృతి పథకం వస్తుందని ఎంతో ఆశతో గడిచిన 4 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారని,కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ పథకానికి కార్యరూపం మాత్రం దాల్చడం లేదని అన్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని, నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి 6 నెలలు గడుస్తున్నప్పటికీ ఒక్క అడుగు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి అన్నచందాగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని అజీజ్ పాషా విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 64 శాతం ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయ పోస్టుల కొరత ఉన్నప్పటికీ పోస్టుల భర్తీకి నేటికీ కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉందని,ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నదని, ఇటీవల కాలంలో అనేక సర్వే సంస్థలు తెలిపినప్పటికీ కేవలం ఉన్న ఉపాధ్యాయుల తోటి విద్యార్థులకు పాఠాలు బోధించడం శోచనీయమని అన్నారు.ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంటే విద్యార్థులకు పాఠాలు ఎలా నేర్పుతారని మహ్మద్ అజీజ్ పాషా ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి ప్రకటనలకు తప్ప ఆచరణలో అమలు చేయడానికి ఏ ఒక్క హామీకి కార్యరూపం దాల్చటానికి ప్రక్రియను ప్రారంభించడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి నిరుద్యోగ యువత జీవితాలతో చలగాటమాడకుండా ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ 3,116 రూపాయలు అమలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని,గత నాలుగు సంవత్సరాల నుండి రావలసిన నిరుద్యోగ భృతిని యువతకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండి.అజీజ్ పాషా  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య, ముత్తయ్య,ముశం సత్యనారాయణ, దొంతగాని జగన్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

నీలి నీలి ఆకాశం చిత్రం చిత్రీకరణ

Satyam NEWS

లారీ కాలిపోయే… ఇన్స్యూరెన్సు రాకపోయే…కటకటాల పాలాయే..

Satyam NEWS

సైడు కాల్వల పని కూడా చేయని కొల్లాపూర్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment