36.2 C
Hyderabad
April 16, 2024 21: 09 PM
Slider నిజామాబాద్

సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలి

#lambada

లబానా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని అసెంబ్లీలో చేసిన తీర్మానం ప్రకారం తమను ఎస్టీ జాబితాలో చేర్చి సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలని లబానా లంబాడీల రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లబానా లంబాడీలు అత్యధికంగా ఉన్నారన్నారు.

27 సంవత్సరాలుగా తమను ఎస్టీ జాబితాలో చేర్చాల్లన్న డిమాండ్ తో చేస్తున్న పోరాటాన్ని సీఎం కేసీఆర్ గుర్తించారని, సదాశివనగర్ మండల కేంద్రంలో మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభానికి వచ్చినప్పుడు తమను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. దానికి అనుగుణంగానే అసెంబ్లీలో ఎస్టీ జాబితాలో చేర్చడానికి తీర్మానం కూడా చేసారని, దానిని అమలు చేయకుండా అక్కడితో మర్చిపోయారన్నారు.

జీఓ 1977 ప్రకారం తమను మతుర జాబితా నుంచి తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో గత అసెంబ్లీ తిర్మణాన్ని అమలు చేయాలని, దానికోసం ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు, స్పీకర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్ పై తమకు నమ్మకం ఉందని, అందుకే మహాభూబ్ నగర్ లో మాదిరిగా తాము నిరసన కార్యక్రమాలు చేయడం లేదన్నారు. అనంతరం గెస్ట్ హౌస్ కు వచ్చిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. తమ న్యాయమైన డిమాండ్ ను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు రథీరాం నాయక్, పెంటయ్య నాయక్, జగదీష్ నాయక్, ప్రేమ్ నాయక్, కిషన్ లాల్, దర్బార్, ఇంధల్ సింగ్ పాల్గొన్నారు

ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందిస్తున్న నాయకులు

Related posts

Generic Medicines For Diabetes In India

Bhavani

తెలంగాణ పథకాలు దేశమంతా: కేసీఆర్

Satyam NEWS

ట్రెడిషన్: ముగిసిన మెస్రం వంశీయుల ఆచారాలు

Satyam NEWS

Leave a Comment