29.2 C
Hyderabad
October 13, 2024 16: 08 PM
Slider తెలంగాణ

రైతులకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చిన సిఎం కేసీఆర్

kolla ml

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్  పాలనలో పంట పండించే రైతు గౌరవంగా బ్రతుకుతున్నారని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కొల్లాపూర్  మార్కెట్ యార్డ్ నూతన పాలక మండలి, ఛైర్మన్ గూన్ రెడ్డి నరేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ కుంచకళ్ల దామోదర్ రెడ్డి, నాగర్ కర్నూల్ జెడ్పి ఛైర్మన్ పద్మావతి, వనపర్తి జెడ్పి ఛైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, ఎంపీపీ గాదెల సుధారాణి హాజరయ్యారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గూన్ రెడ్డి నరేందర్ రెడ్డి తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈసందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. పంట పండించే రైతన్న సమాజంలో గౌరవంగా బ్రతకడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. రాబోయే రోజుల్లో పంటల మార్పిడి అనివార్యం కాబట్టి రైతులు ఖచ్చితంగా పంటలు మార్పులు చేపట్టాలన్నారు. ఇవిధంగా చేయడం వల్లన పంటకు డిమాండ్ పెరుగుతుందన్నారు. ఎగుమతులు పెరుగుతాయన్నారు. కూరగాయలు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్నాయన్నారు. డిమాండ్ ఉన్న కూరగాయలు పండిచడానికి  అన్ని సదుపాయాలు కల్పిస్తున్నా ఎందుకు పండించడం లేదని రైతులు ఆలోచన చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి పూర్వవైభవం వచ్చిందని రైతుకు గౌరవం పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి సాధ్యమైందన్నారు. తెలంగాణలో మొదటి ప్రాధాన్యత రైతుకేనని రైతుకు ఆదాయం పెంచే మార్గాలను ప్రభుత్వం ఆలోచిస్తుందని ఇది కేవలం మార్కెట్ వ్యవస్థలో  ఈనామ్ ద్వారా తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. కొల్లాపూర్ నూతన మార్కెట్ యార్డ్ పాలక మండలికి శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం సభను ఉద్దేశించి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడారు. దళారీ వ్యవస్థ లేని పాలనజరగాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమాలు ప్రజలకు అందలన్నారు. రైతులకు న్యాయమైన మద్దతు ధరకు పలికే విధంగా ప్రభుత్వం చూస్తుందన్నారు. మార్కెట్ యార్డు మరింత అభివృద్ధి జరిగేది ఉందని, ప్రభుత్వం నుండి నిధుల మంజూరు చేసి అభివృద్ధి చేయాలని మంత్రి  సింగిరెడ్డిని కోరారు. కార్యక్రమంలో మామిళ్ల పల్లి విష్ణువర్ధన్ రెడ్డి చింతల పల్లి జగదీశ్వర్ రావు, జిల్లా నాయకులు రత్న ప్రభాకర్ రెడ్డి, కాటం జంబులయ్య, మండల నాయకులు ముచ్చర్ల రాం చందర్ యాదవ్, సర్ పంచ్ దశరథం నాయక్, రవి నాయక్, వేణు గోపాల్ యాదవ్, చంద్ర శేఖర్ చారి హరికృష్ణ, సాయిరాం యాదవ్, అజ్మాద్ధిన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పొన్నూరు వైసీపీ అభ్యర్ధిపై ఈసీ కొరడా

Satyam NEWS

హీరో నాని ఇల్లు, ఆఫీస్ పై ఐటీ దాడులు

Satyam NEWS

లక్కీ పోలీస్ :హత్య కేసు విచారిస్తుంటే ఐఎస్‌ఐ ఏజెంటు దొరికాడు

Satyam NEWS

Leave a Comment