31.7 C
Hyderabad
April 19, 2024 01: 18 AM
Slider నల్గొండ

ప్రతి చివరి ఎకరాకు నీళ్ళు అందించాలని సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవ

#mlasaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు,చింతలపాలెం మండల కేంద్రాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సహకారంతో నూతన గోదాం భవనాల నిర్మాణానికి శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి శంకుస్థాపన చేశారు. హుజూర్ నగర్ తాహసిల్దార్ కార్యాలయంలో 24 మంది లబ్దిదారులకు 2,402,784 రూపాయల విలువ గల కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు.

అనంతరం సైదిరెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుంటే ప్రతిపక్షాలు చూసి ఓవార్వలేకున్నారని,ఏదో ఒక విధంగా అడ్డుకట్టవేసి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నంలో ప్రతిపక్ష నాయకులు ఉన్నారని అన్నారు.

మేళ్లచెరువు,చింతలపాలెం మండలాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, భవనాల నిర్మాణానికి,గోదాములకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమని,దీనికి సహకరించిన  ఉమ్మడి నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్,తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలలో ఏర్పాటు చేస్తున్న గోడౌన్ లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని,మండలం లోని లిఫ్ట్ ల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపుతుందని,ప్రతి చివరి ఎకరాకు నీళ్ళు అందించాలని సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని అన్నారు. ఎవరికీ లంచాలు ఇవ్వకుండా పారదర్శకంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమేని, దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు వంటి అద్భుత పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు.యాదవ సోదరులకు గొర్రెల పంపిణీ,రజక,నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అందించడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప గొప్ప పథకాలు సిఎం కెసిఆర్ తోనే సాధ్యమని అన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

భారత్ లో కొత్తగా 2,876 కరోనా కేసులు 98 మరణాలు

Sub Editor 2

ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ ప్రారంభం

Bhavani

పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ మోహన్

Satyam NEWS

Leave a Comment