27.7 C
Hyderabad
March 29, 2024 04: 12 AM
Slider ముఖ్యంశాలు

మునిసిపల్ ఎన్నికల్లో ఘనవిజయం అందించారు థాంక్స్

#Telangana CM KCR 2

రాష్ట్రంలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు (వరంగల్, ఖమ్మం), ఐదు మున్సిపాలిటీలకు (సిద్ధిపేట, నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు) జరిగిన ఎన్నికల్లో అన్నింటినీ  గెలిపించి, 74శాతం ఓట్లతో టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ధన్యవాదాలు తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 248 స్థానాలకుగాను 181 స్థానాలను టీఆర్ఎస్ కు, 3 స్థానాలను మిత్రపక్షం సీపీఐకి కలిపి 184 స్థానాల్లో గెలిపించి టీఆర్ఎస్ కు తిరుగులేదని మరోమారు నిరూపించారని సీఎం అన్నారు. 

టీఆర్ఎస్ పార్టీయే మా పార్టీ అని తెలంగాణ ప్రజలు నిష్కర్షగా తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఇంతటి అద్భుత విజయాన్ని చేకూర్చిన ఏడు మున్సిపాలిటీల ప్రజలందరికీ సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

Related posts

ములుగు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ

Satyam NEWS

కులం పేరుతో దూషించిన వారిపై కఠిన చర్యలు

Satyam NEWS

హైద్రాబాద్ కాంగ్రెస్ నేత కరోనాతో మృతి

Satyam NEWS

Leave a Comment