27.7 C
Hyderabad
April 20, 2024 00: 32 AM
Slider నిజామాబాద్

వచ్చే నెల రెండున ముఖ్యమంత్రి కేసీఆర్ రాక

#JukkalMLA

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ ప్రాంతం వద్ద నాగమడుగు ఎత్తిపోతల పథకంను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించేందుకు ఏప్రిల్ రెండో తారీఖు ఖరారైందని జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ పైలాన్ సభావేదిక స్థలాలను  జుక్కల్  శాసనసభ్యులు హనుమంత్ షిండే నీటి పారుదల శాఖ సిఈబ శ్రీనివాస్ లతో కలిసి పరిశీలించారు.

పంప్ హౌజ్ నిర్మాణం ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన శిలాఫలకాలతో పాటు సభావేదిక పనులను ప్రారంభించి ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన అధికారులు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని జుక్కల్ శాసనసభ్యులు అధికారులను  ఆదేశించారు.

ఆయన వెంట ఆర్డీఓ రాజాగౌడ్ నీటిపారుదలశాఖ ఈఈ రమేష్ డిఈఈ దత్తాత్రి  స్థానిక నాయకులు దుర్గారెడ్డి విట్టల్ రమేష్ కుమార్ మనోహర్ రమేష్ గౌడ్ అన్నారం వెంకట్రాంరెడ్డి గోరే మియా  రాములు  తహసీల్దార్ వేణుగోపాల్ గౌడ్  తదితరులు ఉన్నారు.

Related posts

‘పెద్దల’ ఆశీస్సులతో యథేచ్ఛగా సాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్

Satyam NEWS

ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకుడిపై వేధింపుల కేసు

Satyam NEWS

ప్యాకప్: మళ్లీ నిలిచిపోయిన సినిమా షూటింగ్ లు

Satyam NEWS

Leave a Comment