35.2 C
Hyderabad
April 20, 2024 16: 48 PM
Slider కరీంనగర్

వేములవాడ నియోజకవర్గo పైన ముఖ్యమంత్రి సీతకన్ను

#adi srinivas

స్థానిక ఎమ్మెల్యే కనపడటం లేదని, బాధలు చెప్పుకుందామంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సమయం ఇవ్వడం లేదని పీసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు.

సిరిసిల్లా జిల్లా చందుర్తి మండలం లో సోమవారం రోజున విలేకరులతో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదివారం సీఎం కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చారని, ఈ సందర్భంగా వారు చూపిన వివక్ష వేములవాడ నియోజకవర్గ ప్రజల పైన సీత కన్నులాగ ఉందని ఆది శ్రీనివాస్ అన్నారు.

స్థానిక కథానాయకుడు అందుబాటులో లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుబడిపోయి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నియోజకవర్గ పరిస్థితి ఉందన్నారు.

వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కథలపూర్, మేడిపల్లి మండలాల చిరకాల వాంఛ కలికోట సురమ్మ చెరువు విషయంలో కానీ,ఏటా 100 కోట్లతో వేములవాడ ఆలయ అభివృద్ధి విషయంలో కానీ,ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలపైన గాని వారు మాట్లాడకపోవడాన్ని చూస్తే ఈ ప్రాంతం పై వివక్ష చూపుతున్నారని భావించక తప్పదన్నారు.

ఆకలితో ఉన్నప్పుడు అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టది అన్నట్లు మా బాధలు సీఎం దృష్టికి తీసుకెళ్లే నాధుడు లేక స్వయంగా వారిని కలిసి మా ప్రజా సమస్యలపై వినతిపత్రాన్ని ఇద్దామంటే కూడా అక్రమ అరెస్టులు,గృహ నిర్బంధాలు చేస్తూ మా పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అణిచివేత లకు గురిచేయడం బాధాకరమన్నారు.

సరిగా పనిచేయడం లేదని సర్పంచ్ లను పదవి నుండి తొలగిస్తున్నామంటున్నారు కదా మరి గెలిపించిన ప్రజలను గాలికి వదిలేసి వెళ్లిన ఎమ్మెల్యే పైన మీరు ఎందుకు చర్య తీసుకోవడం లేదు అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. నిన్నటి ముఖ్యమంత్రి పర్యటనను కేవలం ఆర్భాటాల కోసమే గానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాత్రం కాదని,తప్పకుండా స్థానికంగా లేని ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఆయన వెంట జడ్పీటీసీ నాగం కుమార్,మండల అధ్యక్షుడు రామస్వామి,సర్పంచ్ జలపతి,ఎంపీటీసీ గణేష్,నాయకులు అంచ రాంరెడ్డి,పొద్దుపొడుపు లింగారెడ్డి,గొట్టే ప్రభాకర్,అంచ శ్రీహరి రెడ్డి,బొజ్జ మల్లేశం,పులి సత్యం,దేవస్వామి,కనకరాజువెంకట్ రెడ్డి,గణేష్,శంకర్ రెడ్డి,బాలు తదితరులు ఉన్నారు.

Related posts

చందమామ అందిన రోజు

Bhavani

వరంగల్ జిల్లా కేంద్రంలో రౌడీ షీటర్ దారుణ హత్య

Bhavani

కిడ్నీ సమస్యలు తీర్చడానికి మెడికల్ క్యాంప్

Satyam NEWS

Leave a Comment