తెలుగుదేశం పార్టీ నుంచి జెంప్ చేసి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యుడు సి ఎం రమేష్ ఢిల్లీలో ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు అని అంత నీరసంగా అడుగుతారేంటండీ. ఆయనే ఇప్పుడు బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు తలలో నాలుక. అమిత్ షా ఏ పని చేయాలన్నా ముందుగా సి ఎం రమేష్ నే అడుగుతున్నాడు. అసలు రాజ్య సభలో బిజెపి ఇన్ని బిల్లులు పాస్ కావడానికి కారణం కూడా సి ఎం రమేషే. నిజం మొన్నటికి మొన్న ఆర్టికల్ 370 రద్దు విషయం, జమ్మూ కాశ్మీర్ విభజన విషయంలో కూడా బిల్లుకు అంత మెజారిటీ రావడానికి కారణం సి ఎం రమేష్. అన్ని పార్టీల ఎంపిలను కలుసుకుని వారికి బిల్లు గురించి వివరించి వారు బిల్లుకు మద్దతు ఇచ్చేలా చేసిన అమిత్ షా టీమ్ లో సి ఎం రమేష్ కీలక పాత్ర పోషించాడు…….. ఇవన్నీ పచ్చ మీడియా రాస్తున్న పిచ్చి రాతలు. ఇవన్నీ చదివి సి ఎం రమేష్ ఢిల్లీలో ఏదో చేసేస్తున్నాడని అనుకోవద్దు. బిజెపి అసలు సి ఎం రమేష్ ను పట్టించుకోవడం లేదు. ఇంకా అతనికి బాధ్యతలు అప్పగించడమా? కలలో కూడా జరగదు అని ఒక బిజెపి సీనియర్ నాయకుడు అన్నారు. సి ఎం రమేష్ గత నెల రోజుల్లో రెండు సార్లు అమిత్ షా అప్పాయింట్ మెంట్ అడిగితే ఆయన ఒక్క సారి కూడా ఇవ్వలేదు. అంతే కాదు పార్లమెంటులో అమిత్ షాను కలిసేందుకు సి ఎం రమేష్ ప్రయత్నం చేసినా కుదరలేదు. అదీ సంగతి. అందువల్ల పచ్చ పత్రికలు చదివేసి సి ఎం రమేష్ ఢిల్లీలో తీరిక లేకుండా బిజెపి అప్పగించిన పనుల్లో నిమగ్నమై ఉన్నాడని అనుకోవద్దు. అక్కడ ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. కీలక బిల్లల విషయంలో మద్దతు కూడగట్టేంతటి పెద్ద పనులు సి ఎం రమేష్ కు ఎవరూ అప్పగించడం లేదు. అయ్యా అదీ సంగతి.
previous post
next post