కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం లోని నిరుపేదలు అనారోగ్యంతో చికిత్స చేయించుకోలేక పోతున్నవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున సాయం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఈ నిధులను రాజంపేట శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుడు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి నేడు బాధితులకు అందచేశారు.
రాజంపేట పట్టణంలో ని బైపాస్ లో గల మేడా నిలయం నందు ఈ కార్యక్రమం జరిగింది. ఆరోగ్యం బాగు చేయించుకోవడానికి డబ్బులు లేక అప్పులు చేసి వైద్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండా ముఖ్యమంత్రి చేస్తున్నారని ఆయన అన్నారు. మొత్తం 39 మంది లబ్ధిదారులకు 28 లక్షల 72000 రూపాయలు చెక్కుల రూపంలో విడుదల చేయడం జరిగింది. రాజంపేట శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుడు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి ఆయా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.