అనారోగ్యంతో బాధపడేవారిని ఆదుకోవడానికి నిర్దేశించిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఖమ్మం నియోజకవర్గంలో 32 మందికి ఆర్ధిక సాయం అందింది. ఈ మేరకు ఖమ్మం ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేడు ఆ చెక్కులను వితరణ చేశారు.
తన సిఫార్సు మేరకు 32 మందికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి(CMRF) చెక్కులను vdo’s కాలనీలోని వారి క్యాంప్ కార్యాలయంలో అందచేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం 32 మందికి గాను రూ.10 లక్షల 34 వేల రూపాయల విలువైన చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ తదితరులు ఉన్నారు.