29.2 C
Hyderabad
September 10, 2024 16: 49 PM
Slider కరీంనగర్

సిరిసిల్ల గిరిజన బిడ్డ ఐఐటీకి వెళ్లేలా…

#sharatIAS

జేఈఈలో ర్యాంకు ద్వారా పాట్నా ఐఐటీలో సీటు సాధించి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాకు చెందిన విద్యార్థిని బాదావత్ మధులతకు ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది. ‘ఐఐటీకి వెళ్లలేక.. మేకల కాపరిగా’ అనే శీర్షికతో వార్తాపత్రికల్లో వచ్చిన కథనంపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పేదింటి చదువుల తల్లికి తక్షణమే సహాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు గిరిజన శాఖ అధికారులు విద్యార్థిని మధులత వివరాలు తెలుసుకొని మాట్లాడి, వారి కుటుంబాన్ని హైదరాబాద్ కు తీసుకువచ్చారు.

సచివాలయంలో గిరిజన శాఖ కార్యదర్శి శరత్ ద్వారా విద్యార్థిని మధులతకు రూ  1,51,831 చెక్కును అందజేశారు. విద్యార్థిని కోరిక మేరకు హైఎండ్ కంప్యూటర్ కొనుగోలు కోసం ఇప్పుడిచ్చిన రూ.70వేలకు అదనంగా మరో రూ.30వేలు కూడా ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని అధికారులు భరోసా ఇచ్చారు. ఆర్థిక పరిస్థితి కారణంగా ఇక చదువుకోలేనేమో అని ఆందోళన చెందుతోన్న సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి మీడియా ద్వారా సమస్యను తెలుసుకొని మానవత్వంతో స్పందించినందుకు సంతోషంగా ఉందని విద్యార్థిని మధులత అన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థిని సీఎం కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  షెడ్యూల్ ట్రైబల్ కో-ఆపరేటివ్ ఫైనాన్షియల్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ట్రైకార్) ఛైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్, గిరిజన శాఖ అధికారులు పాల్గొన్నారు.

Related posts

సీనియర్ జర్నలిస్ట్  అంకబాబు అరెస్టు అక్రమం

Satyam NEWS

రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Bhavani

ప‌టిష్ట భ‌ద్ర‌త మ‌ధ్య ఓట్ల లెక్కింపున‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment